NTV Telugu Site icon

Weather Update: పెరుగుతున్న చలి.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..!

Wether Telangana

Wether Telangana

Weather Update: తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఉత్తర భారతం నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న చలిగాలుల కారణంగా చలి గాలులు పెరిగాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రిపూట చలి ఎక్కువగా ఉండగా, పగటిపూట ఎండ తీక్షణంగా ఉంటుంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు స్వల్పంగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో నేడు, రేపు ఉదయం కొన్ని జిల్లాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రం భీమ్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.ఈ జిల్లాల్లో ఉదయం పూట పొగమంచు కమ్ముకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.

Read also: Mohammed Siraj: రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేస్తామని అనుకోలేదు: సిరాజ్

హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 17 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కి.మీ వేగంతో ఆగ్నేయ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదైంది. గాలి తేమ 80 శాతంగా నమోదైంది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తాలోని యానాంలో ఈశాన్య, తూర్పు దిశల్లో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నాయని చెప్పారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉంటుందని, రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పారు. అయితే ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Moblie Blast: జేబులో పేలిన సెల్‌ఫోన్.. యువకుడికి తీవ్రగాయాలు..