NTV Telugu Site icon

Weather Update: తెలంగాణలో పెరిగిన చలి.. ఈ ఏరియాల్లో మరింత గజగజ

Wethers Updats

Wethers Updats

Weather Update: ఉత్తర భారత దేశాన్ని గత వారంపాటు గజగజ వణికించిన చలి ఇప్పుడు దక్షిణ భారత దేశం వైపు వణికించేందుకు వచ్చేస్తోంది. దీని వల్ల తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. అలాగే మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువ కానుంది. జనవరి 12 వరకు చలి తీవ్రత మరింత ఎక్కువకానుంది. ఇక సాయంకాలం 4 గంటల నుంచి చలి ప్రారంభించి తెల్లవారుజాము వరకు కొనసాగనుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో శీతల గాలుల కారణంగా విపరీతంగా చలి పెరిగింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి చాలా జిల్లాల్లో చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

చలి పంజా..

ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడి పోయాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 7.8 , నల్లవల్లిలో 8.2, న్యాల్కల్ లో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. సిద్దిపేట జిల్లా నంగనూర్ లో 9.1, అంగడి కిష్టపూర్ లో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా శివ్వంపేట లో 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడి పోయాయి. చాలా చోట్ల సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొమురం భీం జిల్లా లో 4.7గా నమోదు కాగా.. మంచిర్యాల జిల్లా లో 7.4 నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 7.6 కాగా.. నిర్మల్ జిల్లా 8.9 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదైంది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు కొమురం భీం జిల్లాలో నమోదైంది.

రేపు (సోమవారం) ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేవలం దక్షిణ తెలంగాణలో 6 లేదా 7 జిల్లాలకు మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. ఇక.. నగరంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. కాగా.. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న (శనివారం) 26.2 డిగ్రీలు, 18.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Air India Urinating Case: ఫోన్ స్విచ్చాఫ్.. నిందితుడు మిశ్రా ఎలా చిక్కాడంటే?