NTV Telugu Site icon

Vemula Prashanth Reddy: మీరు చేయాల్సింది అదొక్క‌టే

Vemula

Vemula

“మీకు ఏం కావాలో అన్ని మేము ఇస్తున్నాం. మీరు చేయాల్సింది ఉద్యోగం సంపాదించడం మాత్ర‌మే” అన్నారు. ఉచితంగా ఆన్లైన్ క్లాసుల యాప్ సద్వినియోగం చేసుకోవాలని ఈ సంద‌ర్భంగా మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

నిజామాబాద్ లోని రాజీవ్ గాందీ ఆడిటోరియంలో.. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు సొంత ఖర్చులతో రూపొందించిన ఆన్ లైన్ వీడియో యాప్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి సీపీ నాగారాజు క‌లిసి ప్రారంభించారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్న నేతల రాష్ట్రంలోనే ఇప్పుడు కరెంట్ లేదని ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామ‌న్నారు.

పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు షార్ట్ కట్ లు లేవని, చదవడం ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు, పైరవీలు ఉండవని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు. ప్రెసిడెన్సీయల్ ఆర్డర్ లో మార్పులు చేసి స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు తెచ్చుకున్నామ‌ని , ఆ ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ దే అని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఏకకాలంలో 90 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం తెలంగాణ చరిత్ర అని మంత్రి అన్నారు.

Buddha Venkanna: జగనూ.. ఆ కుంభకోణంపై ఏ యాప్‌లో ఫిర్యాదు చేయాలి?