NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: తొందరలోనే కొత్త రేషన్ కార్డులని అందిస్తాం..

Batti

Batti

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కరెంటు కూడా పోకుండా ప్రజలకు కరెంటు ఇవ్వాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ట్రిప్ అయితే కరెంటు ఇచ్చేవాళ్ళు కాదు.. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్ధరాత్రి కంప్లైంట్ వస్తే అర్ధరాత్రి కూడా వెళ్లి కరెంటు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాం.. క్షేత్రస్థాయిలో కరెంటు సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు.. రాజకీయ లబ్ది కోసం కొంత మంది సిబ్బందిపై దృష్ప ప్రచారం చేస్తున్నారు.. రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు పోవటం అనేది లేనేలేదు.. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు తప్ప.. లైన్ మెయింటెనెన్స్ సమయంలో కరెంటు తీసి చెట్లని కొట్టడం జరుగుతుంది అన్నారు. చెట్ల కొమ్మలు కరెంటు వైర్ల మీద పడినప్పుడు మాత్రమే కరెంటు పోతుంది అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Read Also: Market Value : ప్రపంచంలోని బిలియనీర్ల పాలిట ‘బ్లాక్ ఫ్రైడే’.. రూ. 56 లక్షల కోట్ల నష్టం

ఇక, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భంగా కరెంటు పోతే కూడా కరెంటు పోతుందని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 24 గంటలు రాష్ట్రంలో కరెంటు ఇస్తున్నాం.. కరెంటు వాడకం పెరిగినప్పటికీ కరెంటును తెప్పించి ప్రజలకు ఇస్తున్నాం.. రాబోయే 10 ఏళ్లకు కూడా అవసరమయ్యే కరెంటుని ఉత్పత్తి చేస్తున్నాం.. పొల్యూషన్ లేని విద్యుత్ ఉత్పాదనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో ఎప్పుడూ కరెంటు కోత ఉండదు అని డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే, కొత్తగా రేషన్ కార్డులని అందిస్తామన్నారు. అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తాం.. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది.. లక్ష్యానికి అనుగుణంగా అందరికీ రుణమాఫీ చేస్తున్నాం.. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ కూడా జరుగుతుంది అని భట్టి విక్రమార్క వెల్లడించారు.