NTV Telugu Site icon

Manda Krishna Madiga: నిధులు కేటాయించక పోతే సీఎం, కేటీఆర్‌ ఇలాఖాలో ధర్నా చేస్తాం

Mandakrishna Madiga

Mandakrishna Madiga

Manda Krishna Madiga: అనాధల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలి లేక పోతే సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ నియోజక వర్గాలలో ధర్నాలు చేస్తామని Mrps రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించాన ఆయన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమంపై మండిపడ్డారు. అనాధల జీవితాలలో చాలా చీకట్లు వున్నాయని, అనాధల సంక్షేమం పై సీఎం, కేటీఆర్ ఇచ్చిన హామీలు మీద తీర్మానాల మీద ఏమయ్యాయో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ కి ఆనాధల సంక్షేమం విషయంలో గుర్తు చేయటానికి వచ్చానని తెలిపారు. ఏడు సంవత్సరాల ఏడు నెలల 14 రోజుల కింద తల్లి తండ్రులు కొల్పయిన వారికి సంక్షేమం కింద ఆశ్రమాలు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు కాలేదు అనాద ఆశ్రమాలను ఒక్కసారి కూడా సందర్శించలేదన్నారు. మొదటి రెసిడెన్షియల్ స్కూల్ ను అనాధల కోసం జిల్లాకు ఒకటి ప్రారంభిస్తామన్నారు.

Read also: Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి.. ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు

ఇప్పటి వరకు ఒక్కటి కుడా ప్రారంభించకుండా, ఆ హామీని విస్మరించారని ఆరోపించారు. సీఎం లాగానే హామీలను కేటీఆర్‌ కూడా విస్మరించి కేసీఆర్ లాగే నడుస్తున్నడా..? అంటూ ప్రశ్నించారు. కేటీఆర్‌ ఎప్పుడు దేశం గర్వించే విధంగా అనాధల కోసం చట్టం తెస్తాం అన్నారు కానీ ఇప్పటి వరకు తీసుకు రాలేదన్నారు. అనాధల కు తల్లితండ్రులు తెలియదు, కులం తెలియదు. ఆలాంటి వారికి కుల ధృవీకరణ పత్రాలు లేవన్నారు. వారికి ప్రత్యేక స్మార్ట్ కార్డ్ లు ఇస్తామని కేటీఆర్‌ అన్నారు కానీ ఇప్పటి వరకు తీసుకు రాలేదని గుర్తు చేశారు. అనాధల మానవ అక్రమ రవాణా జరుగుతుంది అని దానికి పాల్పడే వారి పట్ల కటిన చర్యలు తీసుకుంటామని చెప్పి వారి మీద పిడి అక్ట్ పెడతాము అని చెప్పి ఒక్కరి మీదా కూడా పెట్టలేదని మండిపడ్డారు. ఇందిరా పార్క్ లో మేము అనాధ లకోసం ధర్నా చేస్తే ఒక బాబు మాట్లాడుతూ దాతలు వస్తె మేము తింటున్నాం దాతలు రాని రోజు పస్తులు వుంటున్నాం అని చెప్పి ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: Telangana Budget: అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన హరీష్‌ రావు.. ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే…

మరి మనం దేశం కు ఆదర్శంగా వుంటున్నమా కేటీఆర్‌, కేసీఆర్ లు గుర్తించాలన్నారు. పేద రైతులకు రైతు బందు ఇస్తే మాకు సంతోషం అలాంటిది మంత్రి మల్లారెడ్డి లాంటి వారికి భూస్వాములకు రైతు బంధు ఇవ్వద్దు. భూస్వాములకు ఇవ్వకుండా అనాధల సంక్షేమం కోసం ఖర్చు చెయ్యాలి అని అంటున్నామని, ఈ అసెంబ్లీ సమావేశంలో అనాధ లకు ప్రత్యేక చట్టం అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం వారికి స్మార్ట్ కార్డ్ లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అనాధల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలి లేక పోతే సీఎం, కేటీఆర్‌ ఇలాఖాలో ధర్నాలు చేస్తామని, 15 తేదీ నుండి అనాధల హరి గోస దీక్ష పెడతామని హెచ్చరించారు.
Suspension on CI: చేర్యాల CI పై సస్పెన్షన్ వేటు.. బాధ్యతలు చేపట్టి 9 నెలల్లోనే..

Show comments