Site icon NTV Telugu

Kadiyam Srihari: రాజయ్య విజయానికి కృషి చేశాం.. కడియం కామెంట్స్

Mlc Kadiyam Srihari

Mlc Kadiyam Srihari

Kadiyam Srihari: రాజయ్య విజయానికి మేము కృషి చేశామని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో BRS అభ్యర్థిగా పోటీచేసి అవకాశం కల్పించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. స్టేషన్ ఘనపూర్ లోని ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసంతో ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘణపూర్ లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. నా విజయంలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సి పల్లా సహకారం, మంత్రుల సహకారం తీసుకుంటామని అన్నారు. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి.. అవి అన్నీ కూడా త్వరలో సద్దుమనుగుతాయని తెలిపారు. 2014, 2018 లో రెండు పర్యాయాలు రాజయ్యకు పార్టీ అవకాశం ఇచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Health Tips: రోజూ పిస్తా పప్పులను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

రాజయ్య విజయానికి మేము కృషి చేశామని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా విజయానికి కూడా సోదరుడు రాజయ్య సహకరం అందిస్తాడని నమ్ముతున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చేస్తా అని అన్నారు. నాకు వ్యక్తిగత అజెండా లేదు.. ప్రజల అభివృద్దే ఎజెండా అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా నిధులు తీసుకువచ్చానని తెలిపారు. 19 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్లకు మంజూరయ్యిందని, నియోజక వర్గంలో 34.67 కోట్ల కనెక్టివిటీ రోడ్లకు మంజూరు అయ్యాయని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు.
Oppo A38 Price: ఒప్పో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ!

Exit mobile version