MLA Guvvala Balaraju: ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సీబీఐ దర్యాప్తును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కేసీఆర్ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలపై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడారు.
Read also: Ravindra Jadeja: నేనూ ఆడితే బాగుండేది..గాయంపై జడేజా ఎమోషనల్ కామెంట్స్
ఎమ్మెల్యే ప్రలోభాల కేసును సీబీఐ విచారిస్తే ఎందుకు భయపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని దర్యాప్తు సంస్థలను ఆయన కోరారు. న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ముందుకు సాగుతున్నామన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో సిట్ విచారణకు బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. సిట్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు.
V. Hanumantha Rao: రేవంత్ ఫోన్ చేసి పాదయాత్రకి రమ్మన్నారు
