NTV Telugu Site icon

Rash Driving: రోడ్డుపై యువకులు కోతివేశాలు.. ఎంట్రీ ఇచ్చిన పోలీసులు

Warangal Rash Driving

Warangal Rash Driving

Young people are driving rashly on the road: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బైక్ రైడర్స్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఫ్లెక్సీలు, బోర్డింగ్ లు పెట్టి మరీ ప్రచారం చేసినా పట్టించుకోవడం లేదు. కంటి ముందు ప్రమాదాలు జరుగుతున్న పక్కనపెట్టి తమ ఆనందంకోసం బైక్‌ పై స్టంట్‌ లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. బైక్‌ లో ఒక్కరు లేదా ఇద్దరు ఉంటేనే వారు హెల్మెట్‌ పాస్‌ బుక్‌లు, సిగ్నల్‌ క్రాస్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ ఇలా కేసులు బుక్‌ చేస్తున్న అవన్నీ బేఖాతరు చేస్తూ ఒకే బైక్‌ పై ముగ్గురు కూర్చొన్ని స్టంట్‌ చేస్తూ వారిపని వారుచేసుకుంటూ పోతున్నారు యువత. బైక్‌పై ముగ్గురు యువకులు కూర్చొని పబ్లిక్‌ ప్లేస్‌ లో కోతివేశాలు వేసుకుంటూ స్టంట్‌ లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Dhee 15: డాన్సింగ్ కింగ్ ఈజ్ బ్యాక్

వరంగల్ కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగట్టు నుండి భీమారం మెయిన్ రోడ్డు పైనా బైక్ పైన ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు యువకులు కాకతీయ యూనివర్సిటీ పోలీసు అరెస్ట్ చేశారు. ముగ్గురు యువకులు మెయిన్ రోడ్డు పైనా TS24A1324 అను బండి మీద అతివేగంగా, అజాగ్రత్తగా నిర్లక్ష్యంతో వికృత విన్యాసాలు చేస్తూ ఇతర వాహన దారులకు ఇబ్బందులు కలిగిస్తూ డ్రైవింగ్ చేస్తున్న వీడియోను ఒకప్రయాణికుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. దీంతో వరంగల్‌ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నది ఎవరు అన్నది సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు సుర రమేష్, వల్లపు విలాకర్, వల్లపు నాగరాజుగా గుర్తించి kuc పోలీస్ వారు వారిని అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలో మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. వరంగల్ యువతకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.
Drone Attack: దేశ అధ్యక్షుడిపై డ్రోన్‌ దాడికి పాల్పడిన ముగ్గురికి 30 ఏళ్ల జైలుశిక్ష