NTV Telugu Site icon

Maoist letter : వరంగల్ లో మావోయిస్టుల లేఖ కలకలం

Mavoist

Mavoist

వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతుంది. మేడేను పురస్కరించుకొని మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఈ లేఖను విడుదల చేసింది. సామ్రాజ్యవాదాన్ని కూల్చి సోషలిజాన్ని నిర్మిద్దామని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. విప్లవ కార్మిక వర్గం నాయకత్వం వహించాలని మావోలు కోరారు. సోషలిస్టు విప్లవ స్పూర్తితో మేడే వేడుకలు జరపండి అని మావోయిస్టుల అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖలో వెల్లడించారు.

Also Read : Allari Naresh: హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఉగ్రం’: విజయ్ కనకమేడల

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయం దారుణంగా దిగజారింది.. చిన్న మధ్యతరగతి రైతులు, వలస కూలీలుగా మారుతున్నారు అని మావోయిస్టులు రాసిన లేఖలో ఉంది. తెలంగాణలో నిరుద్యోగులు 30 లక్షలకు పెరిగింది.. తొమ్మిది సంవత్సరాల్లో కేవలం 70 వేల ఉద్యోగాలు మాత్రమే తెలంగాణ సర్కార్ ఇచ్చిందని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల్లోని 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి.. భారీ ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి తరిమేస్తున్నారు అంటూ లేఖలో మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ మండిపడ్డారు. సోషలిజం స్థాపనకు మిలిటెంట్ ఉద్యమాలకు సిద్దం కండి అంటూ మావో అధికార ప్రతినిధి జగన్ పిలుపినిచ్చారు.

Also Read : Vc Ravinder Gupta : యూనివర్సిటీ అభివృద్దికి ఆటంకాలు

తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్న చర్యలను అన్ని గమనిస్తున్నామని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ ఆ లేఖలో వెల్లడించారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే నిరోద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.. ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని మావోయిస్టులు తెలిపారు. లేదంటే మిలిటెంట్ ఉద్యమాన్ని చేయాల్సి వస్తుందని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.