NTV Telugu Site icon

Warangal Preethi Case: పూలదండ ఎందుకు తెచ్చావ్.. నిలదీసిన ప్రీతి సిస్టర్

Warangan Preethi Sister1

Warangan Preethi Sister1

Warangal Preethi Sister Questioned Governor Tamilisai: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతిని పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌ను ఆమె కజిన్ సిస్టర్ నిలదీసింది. నిన్న ఆస్పత్రికి గవర్నర్ పూలదండతో వచ్చారని, అసలు పూలదండ ఎవరి కోసం తెస్తారు? అని ప్రశ్నించింది. తన సోదరి ఇంకా బతికే ఉందని, బతికున్న వారి కోసం పూలదండలు తీసుకొస్తారా? అని అడిగింది. గవర్నర్ లాంటి హోదాలో ఉండి మీరేం చేస్తున్నారు? అని మండిపడింది. ఒక సమాజాన్ని కాపాడే డాక్టర్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే మీరేం చేస్తున్నారు? వచ్చి పూలదండలు వేసిపోతారా? అని ఫైర్ అయ్యింది.

Errabelli Dayakar Rao: ప్రీతి ఘటనపై బీజేపీ వాళ్లు లేని తగాదాలు సృష్టిస్తున్నారు

తమకు కావాల్సింది ఓదార్పు కాదు, న్యాయమని పేర్కొన్న యువతి.. ఈ ఘటనపై ఒక ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. పరామర్శించేందుకు వచ్చామని మీడియా ముందు పబ్లిసిటీ చేసుకోవడం కాదని.. మీకు చేతకాకపోతే తామే స్వయంగా కమిటీ వేసుకొని, తమ అక్కకు ఏం జరిగిందో తెలుసుకుంటామని సవాల్ విసిరింది. మీ ఇంట్లో ఆడబిడ్డలకు ఇలాంటి ఘటనలే ఎదురైతే.. మీరు పూలదండలతో వెళ్తారా? అని ప్రశ్నించింది. స్పెషల్ కమిటీ వేయాల్సిందేనని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిందేనని ప్రీతి సిస్టర్ కోరింది. హార్ట్ ఫంక్షనింగ్ లేకపోయినా, ఫంక్షనింగ్ ఉందంటూ ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పరామర్శించేందుకు ఎవరూ రావాల్సిన అవసరం లేదని, స్పెషల్ కమిటీ వేసి ఒక గంటలోనే రిజల్ట్ తీసుకురావాలని ఆ యువతి డిమాండ్ చేసింది.

Kodali Nani vs Chandrababu: నేను, వంశీ వస్తాం.. కొట్టుకుందాం.. నువ్వు రెడీ నా బాబు?

మరోవైపు.. ప్రీతి సిస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజ్ భవన్ స్పందించింది. నిమ్స్ వెళ్లిన సమయంలో గవర్నర్ వాహనంలో పూలదండ ఉండటంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. హనుమంతుని గుడిలో సమర్పించడానికి గాను కారులో పూలదండ ఉంచడం జరిగిందని స్పష్టం చేసింది. అంతే తప్ప.. దానిపై విపరీతార్ధాలు తీయటం సహేతుకం కాదని రాజ్ భవన్ తెలిపింది. అంతేకాదు.. హనుమంతుని గుడిలో వైద్య విద్యార్థిని త్వరగా కోలుకోవాలని కూడా గవర్నరు ప్రార్ధన చేశారని క్లారిటీ ఇచ్చింది. రాజ్ భవన్‌కు వచ్చిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి మెడికో సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవల్సిందిగా ఒక లేఖ ద్వారా ఆదేశించారని వెల్లడించింది. గవర్నరు నిమ్స్ పర్యటనను సరైన దృష్టితో అర్ధం చేసుకోవాలని రాజ్ భవన్ విజ్ఞప్తి చేసింది.

Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ ఎన్నికలు వద్దంటూ తీర్మానం