NTV Telugu Site icon

Warangal Ganesh Festival: గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పోలీసు అనుమతి తప్పనిసరి

Wgl Police

Wgl Police

గణేష్ నవరాత్రులకు అంతా సిద్ధం అయింది. గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మరియు గణేష్ మండపాల నిర్వహకులు పోలీసు అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని వరంగల్ ఏసీపీ గిరికుమార్ కలకోట తెలిపారు. మంగళవారం వరంగల్ టౌన్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆగస్టు 31వ తేది నుండి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను వరంగల్ పోలీస్ వారు గణేష్ నవరాత్రి మండపాల నిర్వహకులకు పలు సూచనలు చేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తప్పని తీసుకోవాల్సి వుంటుందని. ఇందుకోసం ముందుగా నిర్వహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం. నిమజ్జనం తేదీ, ప్రదేశం మొదలైన సమా చారంతో తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్ లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని తెలిపారు.

Read Also: Nikhil Dwivedi: పాకిస్తాన్ పై ప్రధాని ట్వీట్.. హీరో సైటైర్ వైరల్.. ?

ఈ సందర్భంగా గణేష్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏసీపీ మండప నిర్వాహకులకు పలు సూచనలు చేసారు. గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత వారితో అనుమతులు తీసుకోవాలి గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి. గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలి వృద్ధులు, చదువుకునే విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా తక్కువ శబ్దకాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో ఎట్టిపరిస్థితులోను డిజేను ఏర్పాటు చేయరాదు. గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేయవలెను. గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి. గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.

గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట అడటం, లక్కీ డ్రాలు నిర్వహించడం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం. విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసు అధికారులతనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.

Read Also: Electric Vehicles: 2030 నాటికి ఇండియాలో 5 కోట్లకు చేరనున్న ఎలక్ట్రిక్ వాహనాలు

Show comments