Site icon NTV Telugu

MGM : షాకింగ్‌.. మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్‌.. అతను చనిపోలేదట..!

Mgm

Mgm

MGM : ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహం మారిన ఘటనలో సంచలన మలుపు చోటుచేసుకుంది. చనిపోయాడని భావించిన గోక కుమారస్వామి అనే వ్యక్తి, అసలు మృతుడే కాదని వరంగల్ పోలీసులు తాజాగా ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. చికిత్సలో ఉన్నపుడే, ఆయన మరణించాడని భావించిన కుటుంబ సభ్యులు ఒక మృతదేహాన్ని తమ భర్తదని గుర్తించి, దాన్ని ఇంటికి తీసుకెళ్లి దహనానికి సిద్ధమయ్యారు.

Radhika Yadav Murder: టెన్నిస్ ప్లేయర్ హత్య కేసు.. వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు!

అయితే ఊరి చివరికి శవాన్ని తీసుకెళ్తుండగా కుమారస్వామి కుమార్తె శవాన్ని పరిశీలించి.. “ఇది మా నాన్న కాదని” స్పష్టంగా చెప్పింది. వెంటనే వారు మృతదేహాన్ని తిరిగి మార్చురీకి తీసుకెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేరే వ్యక్తిని పరిశీలించగా, అది గోక కుమారస్వామే అని స్పష్టమైంది. దీంతో, అసలు వ్యక్తి బ్రతికున్నాడన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

ఈ క్రమంలో, నిన్న తప్పుగా తీసుకెళ్లిన మృతదేహం ఎవరిది? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ గందరగోళం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆసుపత్రి నిర్వహణపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. మృతదేహాల గుర్తింపు, అప్పగింపు ప్రక్రియలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

WOW : చాట్‌జీపీటీ మెడికల్ మిరాకిల్..! 10 ఏళ్లుగా పరిష్కారం లేని ఆరోగ్య సమస్యకు పరిష్కారం చూపిన ఏఐ..!

Exit mobile version