Nalgonda: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో వైద్యం వికటించింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న 15 మంది చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇంజెక్షన్ వికటించడంతోనే పిల్లలకు వాంతులు, విరోచనాలు, చలి, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పిల్లల పరిస్థితి విషమించడంతో ఆస్పత్రి సిబ్బంది వారిని అత్యవసరంగా ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆసుపత్రిల్లో తీవ్ర…
MGM : ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహం మారిన ఘటనలో సంచలన మలుపు చోటుచేసుకుంది. చనిపోయాడని భావించిన గోక కుమారస్వామి అనే వ్యక్తి, అసలు మృతుడే కాదని వరంగల్ పోలీసులు తాజాగా ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. చికిత్సలో ఉన్నపుడే, ఆయన మరణించాడని భావించిన కుటుంబ సభ్యులు ఒక మృతదేహాన్ని తమ భర్తదని…
MGM : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డెడ్ బాడీ మారిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఒకరికి బదులుగా మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి (50) మూడు రోజుల క్రితం అపస్మారక స్థితిలో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. ఆసుపత్రి అధికారులు పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని…