NTV Telugu Site icon

Warangal: విషాదం.. వరదల బీభత్సంతో 21 మంది మృతి.. ఏడుగురు గల్లంతు

Warangal Heavy Rains

Warangal Heavy Rains

Warangal: వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతం చేశాయి. రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. చెరువులు ఏరులై పారాయి. దీంతో ఇళ్లల్లోకి నీరు చేరడమే కాకుండా.. గాలివానకు ఇళ్ల పైకప్పు ఎగిరిపోయాయి. కొందరు నీళ్లల్లో కొట్టుకు పోగా మరికొందరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్ సహాయంతో ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకుంది. వర్షం వరదలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహావిషాదం జరిగింది. ములుగు జిల్లాలో 13 మంది, హనుమకొండ జిల్లాలో ఐదుగురు, మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు, భూపాలపల్లిలో ముగ్గురు మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన గల్లంతైన వారిలో గొర్రె ఓదిరెడ్డి, వజ్రమ్మ, కోసం కోనసాగుతున్న గాలింపు చర్యలు చేపట్టారు.

ములుగు జిల్లా బూరుగుపేటకు చెందిన బండ సారమ్మ, రాజమ్మ, ప్రాజెక్టు నగర్ కు చెందిన 4ఏళ్ళ బాలుడు సద్దాం అలీగా గుర్తించారు. వర్షం వరదలతో గ్రేటర్ వరంగల్ తో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాలో అఫార నష్టం వాటిల్లింది. వరంగల్ లో వరద బురదలోనే ఇంకా 40 కాలనీలు ఉన్నాయి. జంపన్నవాగు ఉదృతితో కొండాయి గ్రామం జలదిగ్బంధంలోనే ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా పశువులు మృతి చెందారు. ములుగు జిల్లాలో ఐదు చెరువులకు గండ్లు, తెగిపోయిన 52 రోడ్లు, 43 ఇల్లు పూర్తిగా కూలిపోయాయి. పసర తాడ్వాయి మద్య గుండ్లవాగు బ్రిడ్జి వద్ద అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో జాతీయ రహదారి 163ఫై రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యి కోట్ల వరకు నష్టం వాటిలినట్లు ప్రాథమిక అంచన వేశారు. వర్షం వరదలతో టిఎస్ ఎన్పీడిసిఎల్ కు ఏడుకోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇంకా పలు గ్రామాలకు పవర్ సప్లై నిలిచిపోయింది.

Read also: Bhadrachalam: గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి వరద ఉద్రతి పెరగడంతో గోదావరి ఎగువ భాగంలో జాతీయ రహదారి స్తంభించిపోయింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55 అడుగులకు సమీపంలో ఉంది. దీంతో ఎగువ ప్రాంతంలో హైదరాబాదు, వరంగల్ నుంచి చత్తీస్ గడ్, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ,ప్రాంతాలకు వెళ్లే జాతీయ రహదారిపై నీళ్లు చేరుకున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతానికి వచ్చిన లారీలు అన్నీ కూడా రోడ్లమీద చిక్కుకొని పోయాయి భద్రాచలం నుంచి చెట్టు వరకు మధ్య మధ్యలో లారీలన్నీ నిలిచిపోవడంతో గోదావరి ఇంకా పెరుగుదల కనిపిస్తుండతో ఆ లారీలు అన్నిటిని కూడా తిరిగి భద్రాచలం వైపు మళ్ళిస్తున్నారు.

కొమురం భీం జిల్లా సిర్పూర్ (టి) మం..వెంకట్రావు పేట్ అంతరాష్ట్ర బ్రిడ్జ్ పై నుండి పెనుగంగా (వార్దా) నది వరదనీరు ప్రవహిస్తుంది. మహారాష్ట్రకు రాకపోకలు నిలిచి పోయాయి. సిర్పూర్(టి) మం..హుడికిలి వద్ద రోడ్డు పైకి వచ్చిన బ్యాక్ వాటర్ సిర్పూర్(టి) నుండి జక్కాపూర్ మీదగా మహారాష్ట్ర కు రాకపోకలు నిలిచిపోయాయి. పారిగాం వద్ద ప్రధాన రోడ్డు పై ప్రవహిస్తున్న వరదనీరు. సిర్పూర్(టి)- కౌటాల మద్యలో రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్(టి) మండలంలో మూడు మార్గాలలో రాకపోకలు నిలిచిపోయాయి.

గోదావరి వరదలతో చతిస్ గడ్ వెళ్లే జాతీయ రహదారి దిగ్బంధనాలకు గురైంది. జాతీయ రహదారిలో అక్కడక్కడ వరద పట్టేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి .అయితే మరింతగా గోదావరి పెరుగుతుండడంతో కూనవరం రోడ్డులో మధ్యలో ఉన్న లారీలన్నీ చిక్కుకునిపోయాయి .అంతేకాదు హైదరాబాదు నుంచి ఒడిస్సా ఛత్తీస్ గడ్ వెళ్తున్న ప్రైవేటు బస్సులు కూడా చిక్కుకొని పోయాయి. గత అర్ధరాత్రి నుంచి ఈ బస్సులు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భద్రాచలం పక్కన కూడా గోదావరి పెరుగుతుండడంతో ఈ బస్సులు అక్కడే ఉండటం ప్రమాదకరమని ఆ బస్సుల్ని భద్రాచలం వైపు తిప్పి పంపిస్తున్నారు.
Hyderabad MMTS: అలర్ట్.. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకు రైళ్ల రద్దు