NTV Telugu Site icon

Warangal Market: ఎనుమాముల మార్కెట్ ప్రారంభం.. వ్యాపారస్తులు, రైతులకు మంత్రి సూచన

Warangal Market

Warangal Market

Warangal Market: నేటి నుంచి వరంగల్ మార్కెట్ ప్రారంభం అవుతుందని, అధ్వాన్న గోనె సంచులు, యూరియా బస్తాలు తప్ప అన్ని సంచుల కోసం రైతులకు 30 రూపాయలు చెల్లించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గన్నీ బ్యాగుల అంశంపై సోమవారం హనుమకొండలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో మంత్రి రైతు సంఘాల నాయకులు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించి, చర్చించారు.

Read also: Kishan Reddy Vizag tour: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టూర్.. ఎయిర్ పోర్ట్ దగ్గర అలెర్ట్

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. నేటి నుంచి మార్కెట్ ప్రారంభించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని వెల్లడించారు. రైతులు కూడా వీలైనంత వరకు మంచి బ్యాగులు వినియోగించాలని కోరారు. మిగతా మార్కెట్ లలో గన్నీ బ్యాగుల నాణ్యత, ధరపై అధ్యయనం చేసేందుకు ఇద్దరు రైతులు, ఇద్దరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఇద్దరు అధికారులతో కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని, 26వ తేదీలోపు నివేదిక ఇస్తారని, నివేదిక ఇవ్వగానే మరోసారి సమావేశం పెట్టి దీనికి శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. రైతుకు నష్టం రాకుండా చూడాలని, వ్యాపారస్తులు రైతులకు సహకరించాలని అన్నారు. రైతుకు సమస్య రాకుండా మనందరం పాటుపడాలని అన్నారు. నాణ్యతలో రాజీ వద్దని అన్నారు. రైతులు వ్యాపారస్తులకే బాగా తెలుసన్నారు. రైతులు నాణ్యమైన గన్ని బ్యాగ్ లు తీసుకురావాలని సూచించారు. రైతాంగం విషయంలో మన ప్రభుత్వం చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా చేయడం లేదన్నారు. అతుకుల గోనె సంచులకు 30 రూపాయలు ఇవ్వాలని, మరీ చినిగిన బస్తాలు వస్తే రిజెక్ట్ చేద్దామన్నారు. పూర్తిగా చెడిపోయిన గోనె సంచులు, యూరియా బస్తాలను రిజెక్ట్ చేస్తే అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు. రైతులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ , అధికారులతో కలిసి కమిటీ వేసి అధ్యయనం చేస్తాం. ఒక్కో వర్గం నుంచి ఇద్దరు చొప్పున కమిటీలో ఉంటారు. సౌండ్ గన్నీ విషయంలో కొంత మార్పులు చేస్తూ రేపే కొత్తగా తాత్కాలిక ఆర్డరు కలెక్టర్ ఇస్తారన్నారు.

Read also: New Zealand Vs India 3rd T20 Live: నేడే మూడో టీ20.. సూర్య మరో సెంచరీ బాదేస్తాడా?

వరంగల్ కలెక్టర్ గోపి మాట్లాడుతూ.. వ్యాపారస్తుల సమస్య ధాన్యం, పత్తి చెడిపోవడం, సౌండ్ గన్ని బ్యాగ్ కు 30 రూపాయలు ఇవ్వాలనేది 2017 నుంచి అమలులో ఉంది. కొత్తగా వచ్చింది కాన్నారు. గన్ని బ్యాగ్ డబ్బు కట్ చేసే విధానం ఇప్పుడున్నది కాదు, వేరే చాలా విధానాలు ఉన్నాయని, దానిపై అవగాహన కల్పిస్తా్మన్నారు. మీకు రెండోసారి ఉపయోగించే గన్ని బ్యాగ్ కి మాత్రమే డబ్బులు ఇవ్వమని చెప్తామన్నారు. మండల అధికారులతో కౌంటర్స్ ఏర్పాటు చేయిస్తామని, గన్ని బ్యాగ్ లపై వారికి అవగాహన కల్పిస్తామన్నారు. వ్యాపారస్తులు రైతుల విషయంలో సానుకూలంగా ఉండాలని తెలిపారు. సౌండ్ గన్ని కి ధర పెంచడం కోసం కమిటీ వేసి ముఖ్య మార్కెట్ లలో అధ్యయనం చేసి నిర్ణయం చేద్దామన్నారు. రైతులకు కూడా గన్ని బ్యాగ్ లాపై అవగాహన కల్పిస్తామన్నారు. త్వరలో మరో సమావేశం పెడుదామన్నారు. సమావేశంలో మార్కెగింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి, మార్కెటింగ్ శాఖ ఇతర అధికారులు, సిసిఐ అధికారులు, వ్యాపారస్తులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.