Medarama Jatara: తెలంగాణ కుంభమేళా, మేడారం మహాజాతర తొలి ఘట్టమైన గుడిమెలిగె ఉత్సవాలు నేడు జరగనున్నాయి. ఇందులో భాగంగా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాలను అర్చకులు శుద్ధి చేసి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
నేటి నుంచి వరంగల్ మార్కెట్ ప్రారంభం అవుతుందని, అధ్వాన్న గోనె సంచులు, యూరియా బస్తాలు తప్ప అన్ని సంచుల కోసం రైతులకు 30 రూపాయలు చెల్లించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.