Site icon NTV Telugu

Bhatti Vikramarka:దిల్లీ వెళ్లి డ్రామాలాడటం ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు

Bhatti

Bhatti

ధాన్యం కొనలేని కేసీఆర్.. దిల్లీ వెళ్లి డ్రామాలాడటాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారని సీఎల్పీ నేత‌ మల్లు భట్టి విక్రమార్క మండి ప‌డ్డారు. ఖమ్మంజిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ చేయకపోవడంతో రూ.లక్ష రుణం తీసుకున్న రైతులు.. ఇవాళ‌ బ్యాంకులకు రెండున్నర రెట్లకుపైగా బకాయిపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అన్నివిధాలుగా సంక్షోభంలో ఉన్న రైతుల్లో మానసిక, మనోధైర్యాన్ని నింపేందుకే జాతీయ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ వరంగల్‌ డిక్లరేషన ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్‌ డిక్లరేషనను తూచా తప్పకుండా అమలుచేస్తామని ప్రకటించారు. రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలుచేస్తామని స్పష్టం చేశారు. గత కాంగ్రెస్‌ హయాంలో దేశవ్యాప్తంగా రూ.70వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన చరిత్ర ఉందని గుర్తుచేశారు.

వరంగల్‌ డిక్లరేషన మొత్తాన్ని భట్టి విక్రమార్క వివరించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దళితులు, బలహీనవర్గాల వారికి పంపిణీ చేసిన అసైన్డ్ మెంట్‌ భూముల్లో ఒక్క ఇంచి భూమైనా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల కోసం లాక్కొంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కు కల్పిస్తామని ప్రకటించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ చేయకపోవడంతో రూ.లక్ష రుణం తీసుకున్న రైతులు.. ఇవాళ‌ బ్యాంకులకు రెండున్నర రెట్లకు పైగా బకాయి పడ్డారని తెలిపారు. ధాన్యం కొనలేని కేసీఆర్.. దిల్లీ వెళ్లి డ్రామాలాడటాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

గిట్టుబాటు ధర ఇచ్చి పెట్టుబడి కి 15 వేలు ఎకరనికి అందించడం జరుగుతుందని తెలిపారు. భూమి లేని రైతులకు అండగా ఊంటామ‌న్నారు భ‌ట్టి. ధరలు పెంచి రైతుల జీవితాల‌తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత క్వింటాల్ ధాన్యానికి 2500 ఇస్తామ‌న్నారు.ఇతర పంటలకు మద్దతు ధర ఇస్తామ‌ని తెలిపారు. రైతు కోసం కాంగ్రెస్ ఎప్పుడు అండగా ఉంటుందని, రైతు భయపడాల్సిన అవసరం లేదని పేర్కాన్నారు.

విత్తన చట్టం తీసుకుని వచ్చి నకిలీ విత్తనాలు నిర్మూల‌న చేస్తామ‌న్నారు. రైతుల కోసం కమిషన్ ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు ఇప్ప‌టి ప్రభుత్వం లాక్కుంటుందని మండిప‌డ్డారు. దళిత బంద్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి అని అన్నామ‌న్నారు. ధరణి పోర్టల్ ను పూర్తీగా మారుస్తామ‌ని సీఎల్పీ నేత‌ మల్లు భట్టి విక్రమార్క ఈ సంద‌ర్భంగా తెలిపారు.

M. Ramakrishna Reddy: టాలీవుడ్ లో మరో విషాదం

Exit mobile version