Honor Killing: వనపర్తి జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతుంది. సొంత తండ్రే తన చిన్న కూతురిని దారుణంగా హత్య చేశాడు. పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామానికి చెందిన బోయ రాజశేఖర్ తన కూతురు గీత(15)ని కాళ్లు చేతులు కట్టేసి గొడ్డలితో నరికి హత్య చేశాడు. గీత అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందని తెలుసుకున్న రాజశేఖర్ తండ్రి కొంతకాలం పాటు కుటుంబ పరువు తీయవద్దని గీతకు చెప్పాడు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా గీత తన ప్రేమను కొనసాగించడంతో కుటుంబ పరువు తీస్తుందని గీతను దారుణంగా హత్య చేశాడు.
Read also: PM Narendra Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ..
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వనపర్తి జిల్లా డీఎస్పీ ఆనంద్ రెడ్డి, పెబ్బేరు ఎస్సైతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తండ్రే సొంత కూతురిని హత్య చేయడంతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. అల్లారుముద్దుగా గీతను పెంచుకున్నాడని ప్రేమించిందనే ఒక్కకారణంతో ఇంత కిరాతకంగా చంపేస్తారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఈ పరువుహత్యలు అంటూ అభం శుభం తెలియని అమ్మాయిలను మందలించాలి, లేదంటే ఆయువకుడితో మాట్లాడి పెళ్లైన చేయాలని కన్న కూతురినే చంపుకుంటారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.
T20 Worldcup 2022: భారత్-పాక్ మళ్లీ తలబడేది ఎప్పుడంటే?