Site icon NTV Telugu

టీఆర్ఎస్ ఉద్యమ వ్యతిరేకులకు అడ్డాగా మారింది: కిషన్‌ రెడ్డి

హుజురాబాద్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నారు. నేతలు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు హద్దులు దాటుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. టీఆర్‌ఎస్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమ ద్రోహులకు, ఉద్యమ వ్యతిరేకులకు అడ్డాగా మారిందన్నారు. నాడు తెలంగాణ పోరాటాన్ని అణచి వేసిన వాళ్లే ఉద్యమకారులను వేధించిన వాళ్లే నేడు కేసీఆర్‌ దగ్గర కనిపిస్తున్నారన్నారు. కేసీఆర్‌కైనా సామాన్య కార్యకర్తకు అయినా, తన కైనా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఒక్కటేనన్నారు. ఎన్నికల్లో సభలు పెట్టుకోకుండా చేశారని కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలే సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు కిషన్ రెడ్డి.

Exit mobile version