Site icon NTV Telugu

VRA Murder: తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్ఏ దారుణహత్య

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణహత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ దుర్గం బాబు(50)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. దీంతో రక్తం మడుగులో ఉన్న వీఆర్ఏను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా వీఆర్ఏ దారుణహత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడి భార్య ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. పాత గొడవల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని మృతుడి భార్య అభిప్రాయం వ్యక్తం చేసింది. మరోవైపు కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా దుర్గంబాబును చంపేస్తాడని బెదరిస్తున్నారని, దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని మృతుడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

https://ntvtelugu.com/man-pitition-in-supreme-court-for-divorce-due-to-his-wife-is-not-female/
Exit mobile version