NTV Telugu Site icon

Telangana Results: పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన ఓటర్లు..

Brs, Congress

Brs, Congress

Telangana Results: తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్ గత రెండు పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉంది. అయితే తాజా ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించింది. 119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో 65 స్థానాలను గెలుచుకోబోతోంది. 2018లో ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఎమ్మెల్యేలు, లీడర్లు, క్యాడర్ వెళ్లినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లి ఓటమి:

ఇదిలా ఉంటే గతంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు ఈ సారి తెలంగాణ ఓటర్లు షాక్ ఇచ్చారు. అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వర్ రావు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర్ రావు, పినపాకలో రేగా కాంతారావు, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, కొల్లాపూర్‌లో హర్షవర్థన్, తాండూర్‌లో రోహిత్ రెడ్డి, ఇల్లందులో హరిప్రియ ఓటమి చెందారు. వీరంతా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారి గెలుపోటములు..

కొల్లాపూర్ -జూపల్లి కృష్ణారావు గెలుపు

కల్వకుర్తి -కసిరెడ్డి నారాయణరెడ్డి.. గెలుపు

గద్వాల- సరితా తిరుపతయ్య.. ఓటమి

నకిరేకల్ – వేముల వీరేశం..గెలుపు

తుంగతుర్తి- మందుల సామేలు..గెలుపు

ఖమ్మం: తుమ్మల నాగేశ్వర రావు..గెలుపు

పాలేరు- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..గెలుపు

పినపాక – పాయం వెంకటేశ్వర్లు..గెలుపు

ఇల్లందు- కోరం కనకయ్య…గెలుపు

జగిత్యాల- బోగా శ్రావణి..ఓటమి

ఖానాపూర్ – శ్యామ్ నాయక్.. ఓటమి.