Site icon NTV Telugu

Delivery Boy: దారుణం.. డెలివరీ లేటైందని కాలు విరగ్గొట్టిన కస్టమర్‌..

Delevry Boye

Delevry Boye

Delivery Boy: ఆర్డర్ డెలివరీ చేయడంలో ఆలస్యం చేసినందుకు డెలివరీ బాయ్‌పై దాడి చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన షేక్‌ రహమాన్‌ ఫయాజ్‌ జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వచ్చాడు. బోరబండలో నివాసముంటున్న అతడు ఆరు నెలలుగా ఓ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో కేపీ విశాల్ గౌడ్‌కు చెందిన సరుకులు అందించేందుకు ఫయాజ్ వెళ్లాడు. చిరునామా తెలియకపోవడంతో స్థానికులను ఆరా తీశారు. ఆర్డర్ తీసుకుని విశాల్ ఇంటికి వెళ్లేసరికి కాస్త ఆలస్యమైంది. అయితే ఎందుకు ఆలస్యం అని ఫయాజ్‌ను విశాల్ గౌడ్ ప్రశ్నించారు. ఫయాజ్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి విశాల్‌ను ఓ గదిలో బంధించారు. ఏడుగురు వ్యక్తులు క్రికెట్ బ్యాట్లతో అతడిని దారుణంగా కొట్టారు.

Read also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

అయితే ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కేసు నమోదుపై రెండు వాదనలు వినిపిస్తున్నాయి. తీవ్రగాయాలపాలైన ఫయాజ్ తన స్నేహితుల సాయంతో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. సరైన స్పందన రాలేదన్నారు. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఫయాజ్ నగరంలోని కొందరి సహకారంతో సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను కలిశారని తెలుస్తోంది. తనపై దాడి చేసిన విశాల్ గౌడ్ పై ఫిర్యాదు చేయగా.. ఎట్టకేలకు సీపీ ఆదేశాల మేరకు గెడిమెట్ల సీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు ఫయాజ్ కాలు విరిగిందని.. తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కొట్టడంతో ఇంటికి వెళ్లాడని.. చికిత్స కోసం పట్టణానికి వెళ్లాడని చెప్పారు. అయితే కోలుకుని ఆగస్టు 10న జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితుడు కేపీ విశాల్ గౌడ్.. తన స్నేహితులపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mancherial: ఇంత దారుణమా.. ఎడ్లు పెరట్లో మేశాయని రైతుపై దాడి

Exit mobile version