Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Vinod Kumar Who Met The Vice Chairman Of The Nithi Aayog

విభజన చట్టం ప్రకారం ఆర్థిక సాయం చేయాలి: బి. వినోద్‌ కుమార్‌

Published Date :December 30, 2021 , 6:58 pm
By NTV WebDesk
విభజన చట్టం ప్రకారం ఆర్థిక సాయం చేయాలి: బి. వినోద్‌ కుమార్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు బి. వినోద్‌కుమార్‌,ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా, రాజీవ్ కుమార్ ను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధుల పై మాట్లాడారు. అనంతరం మీడియాతో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ భేటీలోని అంశాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారం వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం తెలంగాణకు వనరులు ఇవ్వాలని పొందుపరిచారని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని, నాటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కి లేఖలు రాశారని వినోద్‌కుమార్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. ఇదే అంశాన్ని నీతి ఆయోగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలంగాణ రాష్ట్రానికి 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. కానీ నాటి నుంచి నేటి వరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు.

Read Also:పట్టణ ప్రగతి లక్ష్యాలను పూర్తి చేయాలి: మంత్రి కేటీఆర్‌

ఈ అంశంపై కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రులు లిఖితపూర్వకంగా లేఖలు రాయడంతో పాటు కలిసినప్పుడల్లా అడుగుతున్నామని రాజీవ్‌కుమార్‌కు, వినోద్‌కుమార్‌ వివరించారు. విభజన సమయంలో 9 పాత జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా నీతి ఆయోగ్ గుర్తించింది. బ్యాక్ వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ కింద నిధులు ఇవ్వాలని సూచనప్రాయంగా చెప్పారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం ఒక్కో జిల్లాకు 50 కోట్లు చొప్పున 450 కోట్లు మూడు, నాలుగేళ్ళు ఇచ్చారు. 2019-20 నుంచి ఈ నిధులు ఇవ్వడం లేదు. 900 కోట్లు నీతి ఆయోగ్ నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లి చాలా రోజులు అవుతుందని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. తప్పకుండా సాయం చేస్తామని చెప్పారని, కొన్ని లేఖలను అందజేసినట్టు వినోద్‌కుమార్‌ వివరించారు. వారం, పది రోజుల్లో దీనిపై చర్యలు తీసుకుంటామని రాజీవ్‌ కుమార్‌ చెప్పారన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest news
  • NITI Aayog Vice chairman Rajiv Kumar
  • telangana
  • vinod kumar

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions