Dasyam Vinay Bhasker: ఎన్డీఏ లో చేరే అవసరం లేదు.. మతతత్వంపార్టీతో అవసరం అంతకన్నా లేదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూటా మాటలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అవగాహన రాహిత్యంతో ప్రదానమంత్రి మోడీ మాట్లాడుతున్నారని అన్నారు. మోడీ అవసరంగానీ, బిజేపి అవసరంగానీ బిఆర్ఎస్ కు అవసరం లేదన్నారు. ఎన్డీఏలో చేరే అవసరం లేదు.. మతతత్వంపార్టీతో అవసరం అంతకన్నా లేదన్నారు. మోడీ పచ్చి అబద్ధాలు అడుగుతున్నారని తెలిపారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర విభజన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని అన్నారు. ముమ్మాటికీ తెలంగాణా వ్యతిరేక పార్టీ బీజేపీ అన్నారు. ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.
ఈనెల 6న మంత్రి కేటీఆర్ వరంగల్ నగరానికి వస్తున్నారని తెలిపారు. సుమారు 900 కోట్ల రూపాయల విలువ చేసే పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారని స్పష్టం చేశారు. పదివేల డ్రెస్ లు ఒకే ఒకే సారి ఐరన్ చేసే లాండ్రీ మార్ట్ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఐటి, ఎడ్యుకేషన్ హెల్త్ హబ్ లతో పాటు టూరిస్ట్ హబ్ గా మార్చుతున్నామని తెలిపారు. వరదల నివారణకు 250 కోట్ల తో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. 70 కోట్లతో మోడర్న్ బస్ స్టేషన్ కు శంఖుస్థాపనన చేయనున్నామని తెలిపారు. కుడా గ్రౌండ్ లో సభ అనంతరం తూర్పు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. మాట ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం నిరూపిస్తుందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
Ram Charan: ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో దీక్షను పూర్తి చేసిన గ్లోబల్ స్టార్