Site icon NTV Telugu

Vinay Bhaskar : మా జిల్లా మంత్రులు కనిపించలేదా..?

హనుమకొండ జిల్లాలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో మా మహిళ మంత్రి కనబడ లేదా..? అని ఆయన ప్రశ్నించారు. మా జిల్లా మంత్రులు కనిపించలేదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆహ్వాన పత్రికల్లో మా మంత్రుల పేర్లు ఎందుకు పెట్టలేదని, సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరారు చేశారా.. అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా జాతీయ సాంస్కృతిక మహోత్సవంకు వచ్చిన గవర్నర్ ను గౌరవించలేదని బాదునాం చేయడం సరికాదని, మహిళలను గౌరవించే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు.

ప్రజల ప్రయోజనాలు బీజేపీకి పట్టాదని, ప్రజా ప్రయోజనాల కోసం అడుగుదామంటే కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వరని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్‌కు వచ్చి ఏం తెచ్చారని, వరంగల్‌కు ఏం ఇచ్చారన్నారు. టూరిజం మంత్రిగా టూరిస్ట్ గా వచ్చారు తప్ప వరంగల్ కు ఎం తేలేదన్నారు. బీజేపీ నాయకులు మీకు మోడీ వద్ద పలుకుబడి ఉంటే రాష్ట్రానికి అభివృద్ధికి నిధులు తీసుకురండని ఆయన సవాల్‌ విసిరారు.
తెలంగాణ విభజన చట్టాలు అమలు చేయించండని, కళాకారులను టీఆర్ఎస్ కంటే ఎక్కువ గౌరవించే పార్టీ లేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు మేము ఎప్పుడు ముందు ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version