NTV Telugu Site icon

Village Empty: ఊరంతా ఖాళీ .. పోలీస్ స్టేషన్లో జనం

Police Janam

Police Janam

ఆ ఊరంతా గ్రామస్థులు ఎవరూ లేకుండా ఖాళీ అయ్యింది, ప్రజలంతా ఏదో జాతరకు లేదా విహారయాత్రకు వెళ్ళి వుంటారని మీరనుకుంటే మీరు పొరపడినట్లే. ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులంతా ఎక్కడున్నారో అనుకుంటున్నారా.. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అసలు ఎందుకు ఊరంతా ఖాళీ అయింది, ప్రజలందరూ పోలీస్ స్టేషన్ లో ఎందుకున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్థులు ఎవరు లేకుండా ఖాళీ అయ్యింది, ఆ గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు? అసలు ఏమి జరిగింది ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఉన్నారో తెలుసా?

గత 10 రోజుల క్రితం నుండే ఆ ఊరికి చాలా సమస్యలు ఉన్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మా సమస్యలను తీర్చండి లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి ప్రగతి భవన్ హైదరాబాద్ కి పాదయాత్ర చేస్తూ వెళతాం అంటూ రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప ప్రజాప్రతినిధులకు, అధికారులను వేడుకున్నారు. మీ సమస్యలు ఏమిటి అని అడిగిన నాధుడే నిన్నటి వరకు లేడు, రాత్రి అశ్వారావుపేట ఎంపీపీ కొంతమంది ప్రజాప్రతినిధులు, పోలీసులు అందరూ కలిసి రామన్నగూడెం గ్రామానికి వెళ్లి మీరు రేపు నిర్వహించే పాదయాత్ర నిర్వహించవద్దు మీ సమస్యలు ఏంటో తెలపాలని కోరారు.

ఎప్పటినుంచో పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తానని చెప్పినవి అర్హులైన వారికి ఇవ్వాలని, అలానే రామన్నగూడెం పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి పనిచేయడానికి నిధులు కేటాయించడం లేదని నిధులు కావాలన్నారు. అలాగే వెంకమ్మ చెరువు శిఖం నిమిత్తం భూములు కోల్పోయినవారికి 14 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, ఇంకా పలు సమస్యలు తెలిపారు, వెళ్లిన అధికారులు ప్రజాప్రతినిధులు రామన్నగూడెం గ్రామస్థులకు సరైన హామీ ఇవ్వకపోవడంతో ఉదయం 5 గంటల నుండి పాదయాత్ర చేపట్టడానికి సిద్ధమయ్యారు, అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అర్థరాత్రి సర్పంచ్ స్వరూపని కొంతమంది గ్రామస్తులను ముందస్తు అరెస్ట్ లు చేశారు.

మళ్ళీ ఏమనుకున్నారో ఏంటో రాత్రే వదిలేశారు. అయితే ఉదయం పాదయాత్ర ప్రారంభించి అశ్వారావుపేట మండలం గంగారాం గ్రామానికి వచ్చేసరికి పోలీసులు శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తున్న రామన్నగూడెం గిరిజనులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.ఎంతకీ గ్రామస్థులు వినకపోవడంతో పోలీస్ బలగాలతో గిరిజనులందరిని వ్యాన్ లో ఎక్కించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి స్టేషన్ కి తరలించారు. కొందరిని కిన్నెరసాని పోలీస్ స్టేషన్ కి తరలించారు, అలా సమస్యలు పరిష్కారానికి పాదయాత్ర నిర్వహిస్తున్న రామన్నగూడెం గ్రామస్థులని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఊరంతా ఖాళీ అయి ప్రజలంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.

Ajit Pawar : మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు కరోనా..