కరోనా రక్కసి మరోసారి పడగ విప్పుతోంది. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ఫోర్త్ వేవ్‌కు అడుగులు పడుతున్నాయి. అయితే.. కరోనా థర్డ్ వేవ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా ఎదుర్కున్న విషయం తెలిసిందే. అయితే కానీ.. ఇప్పుడు కరోనా విజృంభిస్తుండడంతో మరోసారి ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఓ సారి కరోనా బారిన పడిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఇప్పుడు మరోసారి కరోనా సోకింది.
తాజాగా ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.