వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామానికి చెందిన కురువ పద్మమ్మ హైదరాబాద్ లింగంపల్లి లోని ఇంట్లో రెండు నెలలుగా ఇంటి పని చేస్తుంది. పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మేంతాలలో రెండు ఎకరాల భూమి ఉంది. ఇంటి యజమానులు పద్మమ్మకు మాయ మాటలు కొడుకు సురేష్ కు తెలియకుండానే గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐదు కోట్లకు విలువ చేసే భూమిని 5 లక్షలకే అప్పనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి సర్వేనెంబర్ 401 లోని రెండు ఎకరాల భూమి సర్వే చేస్తుండగా కొడుకు తెలుసుకొని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య కు కొడుకు సురేష్ జరిగిన ఉదాంతాన్ని తెలియజేయగా కొడుకుకి తెలియకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కొడుకు కబ్జాలో ఉన్న భూమిని మీరు ఎలా తీసుకుంటారు చూద్దామని కొనుగోలు చేసిన వారికి కొడుకు సురేష్ తరపున నిలదీశారు. దీంతో భూమి కొనుగోలు చేసిన పోచమ్మ కుటుంబీకులకు సంబంధించి 20 మంది కిరాయి హైదరాబాద్ సిక్కు గుండాలను పంపించి కొడుకు పై దాడి చేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Pakistan: పాకిస్థాన్‌లో పేలిన కొత్త రకం బాంబు..
పోలీసులు పోచమ్మ భూమి కొనుగోలు చేసిన వారు పంపించిన కిరాయి గుండాలను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కిరాయి గుండాల వద్ద కత్తులు లాఠీలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. పోచమ్మ కొడుకు కలెక్టర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ పద్మమ్మ అమాయక కుటుంబీకులను గుర్తించి ఈ మోసానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ పెంటయ్య పరిగి ఎమ్మెల్యే శ్రీ రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా అమాయకుల భూములను కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తహసిల్దార్లు కూడా కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలను తెలుసుకున్నాకే రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు.
