NTV Telugu Site icon

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి రాకతో కొడంగల్లో సందడి వాతావరణం.. ముఖ్యులతో మాటామంతీ..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: వికారాబాద్ జిల్లా నిన్న సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా సంబరాల తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి రాకతో కొడంగల్ నియోజకవర్గం సందడి వాతావరణం నెలకొంది. నేడు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యులతో సన్నిహితులతో కలిసి దసరా సంబరాల్లో పాల్గొంటారు. ప్రతి దసరాకి కొండారెడ్డిపల్లి తర్వాత కొడంగల్ కు వెళ్లడం సీఎం ఆనవాయితీగా చేసుకున్నారు. ఉదయం 11 గంటలకు ముఖ్యులతో కలిసి మాటామంతి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయునన్న సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం భోజనం అనంతరం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. నగరానికి చేరుకున్న అనంతరం అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో అందరితో కలవనున్నారు.

Read also: CPI Narayana: క్షమించండి… మీ “అలయ్‌ బలయ్‌” కార్యక్రమానికి నేను రాను..

దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లికి చేరుకుని, అక్కడ జరిగే దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో గ్రామస్తులు సీఎం రేవంత్‌ రెడ్డికి బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతారు. సీఎం గా రేవంత్ రెడ్డి స్వగ్రామంలో పర్యటించడం ఇది మొదటిసారి. ఆయన కొండారెడ్డిపల్లిలో రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించబడిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్న ప్రారంభించనున్నారు. ప్రధాన భవనం ముందు మామిడి మొక్కను నాటారు. రూ. 18 కోట్లతో చేపట్టనున్న గర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
Jagga Reddy: ఎంత తోపులం అయిన సరే ఓ రోజు కాటికి వెళ్ళక తప్పదు..