NTV Telugu Site icon

Vikarabad: నేడు కొడంగల్‌లో మంత్రుల పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన

Vikaranad

Vikaranad

Vikarabad: నేడు వికారాబాద్ జిల్లా కొండగల్ లో మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, శ్రీధ‌ర్ బాబు, దామోద‌ర్ రాజ‌న‌ర్సింహా పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్ లో రూ. 75.45 కోట్ల‌తో చేప‌ట్ట‌నున్న‌ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మంత్రులు శంకుస్థాప‌న, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బ‌య‌లుదేరి కొడంగ‌ల్ చేరుకుంటారు. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో హరే రామ హరే కృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అల్పాహారం అందించే కిచెన్ షెడ్డు ప్రారంభించనున్నారు. అనంతరం రూ.19.68 కోట్ల‌తో కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభిస్తారు.

Read also: Health Tips: కొలెస్ట్రాల్ సమస్య.. నాన్ వెజ్ తినకూడదా?

దీంతో పాటు వర్చువల్ గా ఒకే దగ్గరి నుంచి నూతన మండలాలైన కొత్తపల్లి, దుద్యాల, గుండుమాల్ మండలాల్లో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ (26.4 కోట్ల వ్య‌యం) నిర్మాణాలకు శంకుస్థాపన అనంతరం నియోజకవర్గంలో రూ.5 కోట్ల‌తో 25 కొత్త అంగన్వాడీ కేంద్రాల‌కు శంకుస్థాప‌న‌ చేయనున్నారు. రూ. 24.37 కోట్ల వ్యయంతో పాఠశాలల అదనపు తరగతి గదులు, మ‌హిళ స‌మాఖ్య భ‌వ‌నాలు, పీఏసీఎస్ బిల్డింగ్స్, పాఠ‌శాల‌ల కాంపౌండ్ వాల్స్ నిర్మాణ ప‌నుల‌కు మంత్రులు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.
Suriya : ఆగిపోయిన సినిమాను తిరిగి స్టార్ట్ చేస్తున్న సూర్య

Show comments