Telangana Government: వికారాబాద్ జిల్లా లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా గ్రామాల్లో ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. ఫార్మా కాకుండా వేరే కంపెనీలు అయితే స్వచ్ఛందంగా భూములు ఇస్తామన్నా ప్రజలు చెప్పడంతో అక్కడ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ ను త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. టెక్సైల్ కంపెనీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వననున్నట్లు తెలుస్తుంది.
టెక్సైల్ కంపెనీ ఏర్పాటు చేసినా.. ఇక్కడ పొల్యూషన్ ఉండదని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భూసేకరణ చట్టం-2013లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్ల భూసేకరణను ఉపసంహరించుకుంటున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాల్లో సర్వే అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వెల్లడించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో భూసేకరణ అంశంపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై గ్రామస్తులు దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
CM Revanth Reddy: పెద్ద అంబర్‌పేటలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించిన సీఎం