NTV Telugu Site icon

Vikarabad: ఆ మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు బంద్‌.. పోలీసులు భారీ బందోబస్తు..

Cikaranad

Cikaranad

Vikarabad: వికారాబాద్ జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో దుద్యాల, కొడంగల్, బోంరాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పలువురు జిల్లాకు రానున్న నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని మండలాలకు అనుమతించడం లేదు. మరోవైపు కలెక్టర్‌ పై దాడికి జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఎమ్మార్వోలు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఒక వైపు నిరసన, మరోవైపు పలు నాయకులు మండలాలకు రానున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Read also: Dowry Harassment: విశాఖలో వరకట్న వేధింపులకు మరొక వివాహిత బలి

వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. వాహనాలను తనికీలు చేసి అనుమతిస్తున్నారు. లగచర్ల ఘటనలో 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అధికారులపై దాడికి పాల్పడిన వారిలో సురేశ్ కీలకంగా ఉన్నట్లు సమాచారం. రాజకీయ కోణంలోనూ విచారణ జరుపుతున్నామని, విచారణలో అన్నీ తెలుస్తాయని చెప్పారు. అర్ధరాత్రి నుంచి పోలీసు బలగాలు భారీ ఎత్తున లగాచర్లను చుట్టుముట్టాయి. విద్యుత్‌ను నిలిపివేసి ప్రతి ఇంటిని దిగ్బంధించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరినీ అనుమతించడం లేదు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామాస్తులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే..
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్

Show comments