NTV Telugu Site icon

Vikarabad Crime: వికారాబాద్ లో దారుణం.. తల్లిని చంపిన కసాయి కొడుకు..

Vikarabad Crime

Vikarabad Crime

Vikarabad Crime: వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ లో దారుణం జరిగింది. తల్లిని కన్న కొడుకు చంపిన ఘటన సంచలనంగా మారింది. సయ్యద్‌ మల్కాపూర్‌ లో శంకరమ్మ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే తన కొడుకు రోజు తాగి ఇంటి వస్తుండంలో తల్లి కొడుకును మందలించేది. కుటుంబానికి పోషించాల్సిన కొడుకే ఇలా తాగి ఇంటికి వస్తే ఎలా? అంటూ రోదించేది. విసుగు చెందిన కొడుకు తల్లిపై కక్ష పెంచుకున్నాడు. నిన్న (బుధవారం) రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. దీంతో కొడుకును తల్లి మందలించడంతో ఆవేశం చెందిన కొడుకు ఆమెతో వాదించాడు. గొడవ తాగిన మైకంలో తల్లిని తన్నడంతో ఒక్కసారికిగా తల్లి (శంకరమ్మ) రోడ్డుపై కుప్ప కూలింది. అయినా తల్లిపై కొడుకు కర్కశంగా ప్రవర్తించడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొడుకు అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లిపోయాడు. అయితే స్థానికులు శంకరమ్మను తట్టిలేపిన స్పందించలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పరిగి పోలీసులు శంకరమ్మ మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. శంకరమ్మ కుటుంబ సభ్యులను, ఇంటిదగ్గర పరిగి పోలీసులు విచారణ జరిపారు. కొడుకును అదుపులో తీసుకుని దర్యాప్తు చేసేందుకు సిద్దమయ్యారు. కొడుకు శంకరమ్మను బలంగా తన్నడంతో ఆమె చనిపోయిందని స్థానికులు పోలీసులకు తెలిపారు.
Largest Link Bridge: యాదాద్రి భక్తులకు ఊరట.. ఆలయ సమీపంలో లింక్ ఫ్లైఓవర్ ఏర్పాటు ..

Show comments