Vikarabad: రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నం.. రైలు- ప్లాట్ ఫారం మధ్యలో ఇరుక్కున్న ప్రయాణీకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం తప్పింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్‌కు చెందిన సతీశ్ వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అయితే, అప్పటికే ప్లాట్‌ఫామ్‌పై నుంచి రైలు కదులుతుంది. దీంతో రన్నింగ్ ట్రైన్‌ను ఎక్కేందుకు అతడు ట్రై చేశాడు. ఈ క్రమంలో అదుపు తప్పి రైలు- ప్లాట్‌ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇక, రైలు కొద్ది దూరం అతడిని లాక్కెల్లింది. వెంటనే అలర్ట్ అయిన రైల్వే సిబ్బంది, పోలీసులు. ట్రైన్ నిలిపివేశారు. తోటి ప్రయాణీకుల సహాయంతో ట్రైన్- ప్లాట్ ఫారం మధ్యలో ఇరుక్కున్న ప్రయాణీకుడు సతీశ్ ను ప్లాట్ ఫాం పగులగొట్టి బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు.
Read Also: IND vs ENG: చివరి 3 టెస్టులకు జట్టు ఎంపిక.. విరాట్ కోహ్లీ తిరిగి వస్తాడా?
Also Read
- Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
అయితే, ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ప్రయాణికుడు సతీశ్ చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో ట్రైన్ రెండు గంటల పాటు ఆగిపోయింది. అయితే, రైల్వే స్టేషన్ లోపల రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించినా.. దిగేందుకు ప్రయత్నించిన ప్రమాదకరమని తరచూ రైల్వే అధికారులు అనౌన్స్‌మెంట్ చేస్తుంటారు. అంతేగాక, అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అయినా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాల పైకి తెచ్చుకుంటారు. రైలు మిస్ అవుతుందన్న హడావుడిలో సదరు ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి ప్రమాదం బారిన పడ్డాడు అని వికారాబాద్ రైల్వే స్టేషన్ అధికారులు పేర్కొన్నారు.
VIDEO | Passengers stop express train as man gets stuck between platform and train at Vikarabad station in Telangana.
A commuter was trying to board a moving train when he fell and was dragged along the platform. Passengers alerted the railway officials. Authorities rescued the… pic.twitter.com/s5KDRYCYTz
— Press Trust of India (@PTI_News) January 30, 2024
తాజావార్తలు
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!