NTV Telugu Site icon

MLA Rammohan Reddy: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది..

Mla Rammohan Reddy

Mla Rammohan Reddy

బీఆర్ఎస్ పై పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. పదేళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సీపీఐ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా..? అని మండిపడ్డారు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నది మీరు కాదా..? పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుందని ఎమ్మెల్యే తెలిపారు.

Hyderabad: పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య.. ఎందుకు చంపాడంటే..?

2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుందని.. ఇందులో టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, వైసీపీ నుంచి ముగ్గురు, బీఎస్సీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరిని చేర్చుకున్నారని ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తెలిపారు. 2018లో 16 మందిని చేర్చుకోలేదా..? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి ప్రలోభపెట్టింది మరిచిపోయారా అని అన్నారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రి వర్గంలోకి తీసుకోలేదా..? అని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మీ మంత్రివర్గంలోకి తీసుకోలేదా.. అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్ల పైన చర్యలు తీసుకున్నారా..?అని ప్రశ్నించారు.

Pallavi Prashanth : ఆ రోజు అందుకే సీఎంని చేయమన్నా.. పొలిటికల్ ఎంట్రీపై ఓపెనయిపోయాడుగా!

కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులపైన ఒక్కసారి కూడా కనీసం విచారణ కూడా చేయలేదు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ భావించలేదని ఎమ్మెల్యే చెప్పారు. 100 రోజుల పాటు మేం ఆ ఆలోచన కూడా చేయలేదు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇచ్చాం. మా ముఖ్యమంత్రి వారికి అపాయింట్మెంట్ ఇచ్చి సమస్యలు తెలుసుకున్నారన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేశాయని ఆరోపించారు. ప్రమాణస్వీకారానికి ముంది కడియం శ్రీహరి ప్రభుత్వం కూలిపోతుందన్నారు.. త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ అనలేదా…? అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కుట్రలకు బలి కావడానికి రేవంత్ రెడ్డి చేతకాని వాడు కాదు.. దెబ్బకు దెబ్బ తీస్తాం.. తమ ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో తమకు తెలుసని అన్నారు.