NTV Telugu Site icon

Navy Radar Station: దామగుండంలో నెవీ రాడార్‌ స్టేషన్‌.. శంకుస్థాపన చేసిన రాజ్‌ నాథ్‌ సింగ్‌, రేవంత్ రెడ్డి

Navy Radar Station

Navy Radar Station

Navy Radar Station: దామగుండం నెవీ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుంది. దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ సెంటర్‌గా కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్మిస్తోంది. శంకుస్థాపన స్థలానికి చేరుకున్న రాజనాథ్ సింగ్‌కు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు మరికొందరు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుని ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ స్టేట్ కీలక అడుగు ముందుకు వేసిందన్నారు.

Read also: Ponnam Prabhakar: గురుకుల పాఠశాలకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు..

దేశ రక్షణ శాఖా వ్యవస్థ కోసం హైదరాబాద్ నిలయంగా ఉందన్నారు. దేశంలో సముద్ర మార్గంలో ప్రయాణించే వ్యవస్థ కోసం వికారాబాద్ లో వీ.ఎల్.ఎఫ్ ఏర్పాటు హర్షణీయం అని తెలిపారు. వికారాబాద్ లో రెండవ వీ ఎల్ ఎఫ్ ఏర్పాటు చేస్తుంటే అపోహలు సృష్టిస్తున్నారన్నారు. దేశ భద్రత రక్షణ కోసం తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. దేశ భద్రత కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. ప్రాజెక్ట్ ప్రారంబించాలని రాజ్ నాథ్ సింగ్ నాతో మాట్లాడారు వెంటనే ఆదిశగా అడుగులు వేశామన్నారు. దేశ రక్షణ కోసం ప్రభుత్వంలో ఉన్న మేమంతా పాటు పడుతామని తెలిపారు. వి ఎల్ ఏ స్టేషన్ ప్రాజెక్ట్ చేపడుతున్న చోట ఇక్కడ రామలింగేశ్వర దేవాలయం ఉంది భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరుతున్నానని తెలిపారు. ఇదిలా ఉండగా 10 ఏళ్ల క్రితమే రాడార్ సెంటర్ ఏర్పాటు ప్రక్రియను కేంద్రం ప్రారంభించినా. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దామగుండం అటవీ ప్రాంతంలో 2900 ఎకరాల భూమిని కేటాయించి రాడార్ సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.

Telangana: గురుకుల పాఠశాలలకు తాళాలు.. బయటే టీచర్లు, విద్యార్దుల నిరీక్షణ..