T. Ram Mohan Reddy: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఇక, కేటీఆర్ దమ్ముంటే శివారెడ్డిపల్లెకి రావాలంటూ సవాల్ విసిరారు. మీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ ఇచ్చిందో.. మా సర్కార్ ఎంత ఇచ్చిందో నువ్వు ఆర్టీఐకి దరఖాస్తు చేసుకుంటే తెలుస్తుంది అన్నారు. ఇక, పూర్తి వివరాలు కావాలంటే, అగ్రికల్చర్ డైరెక్టర్ గోపీకి అర్జీ పెట్టుకుంటే పూర్తి డేటా ఇస్తాడన్నారు. అయితే, పరిగి నియోజకవర్గంలో రూ. 1000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మీరు చేసిన చారాణా రుణమాఫీ వడ్డీలకి సరిపోలేదు.. వికారాబాద్ లో ఒక్క రైతుకైనా మీరు రుణమాఫీ చేశారని ప్రశ్నించారు. ఇక, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పేరుతో పరిగి వచ్చిండు.. ఆయన గురించి మాట్లాడితే మేము స్వాగతిస్తాం.. కానీ, కేటీఆర్ ఒక్క మాట అంబేద్కర్ గురించి మాట్లాడి.. 99మాటలు నా గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిండు అంటూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Manchu Family: మెజిస్ట్రేట్ ముందే తిట్టుకున్న మంచు మనోజ్ & మోహన్ బాబు!
ఇక, రేవంత్ రెడ్డి లాటరీ ముఖ్యమంత్రి అని కేటీఆర్ అన్నాడు.. కానీ, నువ్వు అమెరికాలో ఉండి లాటరీతో మంత్రివి అయ్యావంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత లాటరీ బ్యాచ్ అని విమర్శించారు. ఇక, ఫార్ములా ఈ-కార్ రేసులో నీపై ఏసీబీ, ఈడీ విచారణ చేస్తుంది.. లిక్కర్ స్కాంలో నీ చెల్లి జైలుకు పోయి వచ్చింది.. కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు.. ఫాన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు విచారణ ఎదుర్కొంటున్నాడు అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిగి నియోజక వర్గంలో ఫైలెట్ ప్రాజెక్టు కింద మండలంలోని ఒక గ్రామంలో అందరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు.. కానీ, దుబాయ్, సింగపూర్ లలో కేటీఆర్ ఎంత మందిని పెట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించిన ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందడానికి కేటీఆర్ అబద్దాలు చెప్తుండు.. నీవు ఇలాగే అబద్దాలు చెబితే.. ప్రజలు నిన్ను బయట తిరగనివ్వరు అంటూ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.