NTV Telugu Site icon

Vikarabad: కస్టమర్ పై దాడి చేసి కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది

Tandoor

Tandoor

వికారాబాద్ జిల్లా తాండూర్ లోని దుర్గా గ్రాండ్ యువర్ రెస్టారెంట్ సిబ్బంది రెచ్చిపోయారు. ఓ కస్టమర్ పై దాడి చేసి రెస్టారెంట్ సిబ్బంది కొట్టారు. ఫుడ్ ఆర్డర్ చేయడానికి రెస్టారెంట్ నెంబర్ కి కాల్ చేసిన కందనెల్లి తండాకు చెందిన ప్రకాష్ రాథోడ్.. ప్రకాష్ ఫోన్ నెంబర్ ను రెస్టారెంట్ సిబ్బంది బ్లాక్ లిస్టులో పెట్టింది. రెస్టారెంట్ కు చేరుకొని నా నెంబర్ ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టారని కస్టమర్ ప్రకాష్ రాథోడ్ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వివాదం నెలకొంది.

Read Also: CHAARI 111 : స్పై ఏజెంట్ గా కడుపుబ్బా నవ్వించబోతున్న వెన్నెల కిషోర్..

రెస్టారెంట్ సిబ్బందికి ప్రకాష్ కు మధ్య మాట మాట పెరగడంతో కస్టమర్ ను రెస్టారెంట్ సిబ్బంది బూతులు తిడుతూ దాడి చేసి కొట్టారు. దాడి చేసి కొట్టిన దృశ్యాలు రెస్టారెంట్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తనపై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేసి కొట్టారంటూ తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధితుడు ప్రకాష్ రాథోడ్ ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Read Also: Ormax: టాప్ 10 పాన్ ఇండియా స్టార్స్… ఈ నలుగురు మొనగాళ్లు!

అయితే, దుర్గా గ్రాండ్ యువర్ రెస్టారెంట్ పై ఫిర్యాదును పోలీసులు స్వీకరించాలని బాధితుడు ప్రకాష్ రాథోడ్ డిమాండ్ చేశాడు. నా ఫోన్ నెంబర్ ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టావని అడిగినందుకే రెస్టారెంట్ సిబ్బంది తనను బూతులు తిట్టి.. దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. రెస్టారెంట్ యాజమాన్యం సపోర్ట్ తోనే సిబ్బంది తనపై దాడి చేశారని బాధితుడు ప్రకాష్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Show comments