NTV Telugu Site icon

Vikarabad: కలెక్టర్‌పై దాడి.. రేపటి నుండి పెన్ డౌన్..!

Vikarabad Collector

Vikarabad Collector

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా అధికారులు నిరసన చేపట్టారు. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి.. జీవిత ఖైదు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. పరిగి నియోజకవర్గంలోని తహసిల్దార్ కార్యాలయాలను మూసివేసి నిరసన తెలుపుతూ తహశీల్దారులు, రెవెన్యూ సిబ్బంది జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా.. కలెక్టర్ పై దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు.

Read Also: EPFO: కేంద్రం కీలక నిర్ణయం..! త్వరలో ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పే ఛాన్స్!

సొంత జిల్లాలో జిల్లా కలెక్టర్, అధికారులపై దాడిని ఉద్యోగ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. కలెక్టర్, అధికారులపై దాడి చేసిన వాళ్లని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రేపటి నుండి పెన్ డౌన్ చేస్తామని ఉద్యోగ సంఘం నాయకులు తెలిపారు. ఉద్యోగుల నిరసనతో జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాలలో భూమి రిజిస్ట్రేషన్లు స్తంభించి పోయాయి. లగచర్ల దాడి ఘటనలో కొడంగల్ కాడ ఆఫీసర్ వెంకట్ రెడ్డికి తలకు బలమైన గాయం అయింది. ఈ క్రమంలో.. వికారాబాద్ జిల్లా ఎస్పీ కారులో వెంకట్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

Read Also: Ponguleti Srinivas Reddy: రేస్ కార్ల కేసుకే కంగారు పడితే ఎలా..? రాబోయే రోజుల్లో అనేక కేసులు