NTV Telugu Site icon

Lagacharla Incident: లగచర్ల ఘటనపై పరిగి పీఎస్ లో ముగిసిన సమీక్ష..

Parigi

Parigi

Lagacharla Incident: వికారాబాద్‌ జిల్లాలోని లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటనలో పరిగి పీఎస్‌లో సమీక్ష ముగిసింది. ఈ మీటింగ్ లో అదనపు డీజీ మహేష్‌ భగవత్‌, ఎస్పీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. దాడికి ముందు, తర్వాత జరిగిన పరిణామాలపై అదనపు డీజీ సుధీర్ఘంగా చర్చించారు. లగచర్ల ఘటనపై ప్రభుత్వానికి నివేదికను మహేష్‌ భగవత్‌ సమర్పించనున్నారు. నాలుగు గంటల పాటు సమీక్ష సమావేశం కొనసాగింది.

Read Also: Stock Market: నాల్గో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

కాగా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనతో పాటు దాదాపు 55 మందిని పోలీసులు అరెస్ట్ చేసి పరిగి సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. ఈ క్రమంలోనే ఆయనతో వరుసగా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ములాఖాత్ అవుతున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పట్నం నరేందర్ రెడ్డికి ఈ కుట్ర కేసుతో ఏం సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కొడంగల్ నుంచే ప్రారంభమయ్యిందన్నారు. ఉద్యమాలు, కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు.. అన్యాయంగా పేద ప్రజల భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు.