Vikarabad Crime: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. అటవీ ప్రాంతంలో మహిళ మెడకు చీర కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు హంతకుడు. మృతురాలిని చేవెళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నాలుగు రోజుల క్రితం (జనవరి 15) వికారాబాద్ జిల్లా చేవెళ్లకు చెందిన అనసూయ అనే మహిళ హత్యకు గురైంది. అటవీ ప్రాంతంలో హంతకుడు గొంతుకోసి హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ కేసులో బాబు నిందితుడని తేల్చారు. అనసూయను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడని.. ఆ తర్వాత బాబు ఆమె కాళ్లు, చెవి ప్లగ్స్ తీశాడని చెప్పాడు. బాబుతో అనసూయకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు బాబును అదుపులోకి తీసుకుని క్రైమ్ హిస్టరీని పోలీసులు బయటకు తీస్తున్నారు. బాబుపై గతంలో చాలా కేసులు నమోదయ్యాయని వివరించారు.
గ్రామంలో బాలుడిని హత్య చేసినందుకు గ్రామస్తులను కొట్టి ఊరి నుంచి వెళ్లగొట్టారని వివరించారు. జైలు నుంచి వచ్చాక వరుస హత్యలకు పాల్పడ్డాడు. అనంతగిరి గుడిలో కూడా రామస్వామి దొంగతనం చేసినట్లు ఆధారాలు వెలికితీసారు. అయితే.. హంతకుడు బాబు అలియాస్ రామస్వామి సీరియల్ కిల్లర్ అని పోలీసులు తెలిపారు. రామస్వామిపై ఇప్పటికే 5 హత్య కేసులున్నాయని… ఒంటరి మహిళలే తన టార్గెట్ చేసేవాడని తెలిపారు. కొద్ది రోజులుగా మహిళతో ఉండి అక్రమ సంబంధం పెట్టుకొని మహిళలను నమ్మించి రామస్వామి హత్య చేయిస్తాడని పేర్కొన్నారు. ఐదుగురు మహిళలను రామస్వామి ఇలాగే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. గతంలో రామస్వామి ఓ మహిళ తలను నరికి, తలను, మొండెం వేర్వేరుగా పాతిపెట్టాడు.
Naa Saami Ranga collections : ఐదో రోజు నాగార్జున మూవీ కలెక్షన్స్..అన్ని కోట్లు వస్తే హిట్..