NTV Telugu Site icon

Vikarabad Crime : వికారాబాద్ జిల్లాలో దారుణం.. మైనర్ బాలిక ప్రసవం

Karankot

Karankot

వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప‌ద‌వ‌త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్ధినిని అదే గ్రామానికి చెందిన యువ‌కుడు ప్రేమ పేరుతో గ‌ర్భ‌వ‌తిని చేశాడు. ఆయువ‌తి ఏడు నెల‌ల గ‌ర్భ‌వ‌తి కాగా నిన్న శుక్రావారం ఓ ప్ర‌వేట్ ఆసుప‌త్రిలో మ‌గ శిశువును ప్ర‌శవించింది. ఈ ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివ‌రాల్లో వెళితే.. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం జిన్ గుర్తి లోని ఓ .. హై స్కూల్ లో విద్యార్ధిని పదవ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువ‌కుడు ఆ యువ‌తితో ప‌రిచ‌యం ఏర్ప‌రుచుకున్నాడు. ప్రేమించాన‌ని న‌మ్మించి ఆ యువ‌తిని లోబ‌రుచుకున్నాడు. పెళ్ళి చేసుకుంటాన‌ని చెప్ప‌డంతో.. ఆ యువ‌తి ఆత‌న్ని న‌మ్మింది. దానికి ప్ర‌తి ఫ‌లంగా ఆ యువ‌తి 7నెల‌ల గ‌ర్భ‌వ‌తి అయ్యింది. ప్ర‌స‌వ స‌మ‌యం కావ‌డంతో ఆయువ‌తిని త‌ల్లిదండ్రులు తాండూర్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తీసుకువ‌చ్చారు. ఆయువ‌తి పండెంటి మ‌గ‌బిడ్డ‌ను జ‌న్మ‌నిచ్చింది. కాగా.. ఆయువ‌తి మైన‌ర్ కావ‌డంతో ఆసుప‌త్రి వ‌ర్గాలు షాక్ కు గుర‌య్యారు.

బాధితురాలి త‌ల్లిని వివ‌ర‌ణ కోర‌గా.. ఆయువ‌కుడు పెళ్ళి చేసుకుంటాడ‌ని, అత‌నితో వివాహం చేస్తామ‌ని చెబుతున్నారు. అయితే.. పోలీసులకు సమాచారం అడగగా వారికి ఎలాంటి సమాచారం లేదని , ఎటువంటి ఫిర్యాదులు అంద‌లేదని కరణ్ కోట్ ఎసై మధుసూదన్ తెలిపారు.

మేడం గారికి ఆ శాఖ కలిసిరాలేదా?