Site icon NTV Telugu

Vijayashanti: బండి సంజయ్ మార్పు బాధాకరం.. విజయశాంతి సెన్సేషనల్ ట్వీట్

Vijayashanti On Bandi

Vijayashanti On Bandi

Vijayashanti Emotional Tweet On Bandi Sanjay Kumar: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి తాజాగా ట్విటర్ మాధ్యమంగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నిప్పులు పుట్టించే నడకలను పార్టీకి నేర్పించిన అధ్యక్షులు బండి సంజయ్ మార్పు బాధాకరమని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే.. బీజేపీ అగ్రనాయకత్వం మరింత మంచి బాధ్యతను సంజయ్‌కి అప్పగిస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే తమ కార్యకర్తల మనోభావాలను బీజేపీ హైకమాండ్ గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు.. బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా నియమించబడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన ఈటెల రాజేందర్‌కి విజయశాంతి ట్విటర్ మాధ్యమంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Snapchat Trap: స్నాప్‌చాట్ ద్వారా ట్రాప్.. కలవకపోతే న్యూడ్ ఫోటోస్ వైరల్ చేస్తానంటూ బెదిరింపులు

ఇదిలావుండగా.. అధ్యక్షుడి మార్పుపై తెలంగాణ బీజేపీలో చిచ్చు రగిలింది. బీజేపీ పెద్దలపై తెలంగాణ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈటెల రాజేందర్‌ను తృప్తి పర్చడానికే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఓ కార్యకర్త సీరియస్ అయ్యాడు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుండి తొలగించడమేంటని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. మరోవైపు.. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నా, పెత్తనం అంతా ఇక ఈటలదే ఉంటుందంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా పార్టీ సిద్దాంతం, జెండా పట్టుకుని ఉన్నందుకు.. తమకు తగిన శాస్తే జరిగిందంటూ బండి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క పార్టీలో నుండి వచ్చిన వ్యక్తికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా? అని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే.. పార్టీలో ఉండాలో లేదో తెల్చుకుంటామంటూ వాపోతున్నారు.

Husband Killed Wife: ‘ఫోన్’ పెట్టిన చిచ్చు.. భార్యని కాల్వలో తోసేసి హత్య చేసిన భర్త

Exit mobile version