Site icon NTV Telugu

VijayaShanthi: మేము తిరగబడితే మీరు తట్టుకోలేరు.. అవినీతిలో లిమిట్ దాటారు..

Vijayashanthi, Kcr

Vijayashanthi, Kcr

Vijayashanti Comments On KCR: అవినీతిలో లిమిట్ దాటారని, బీజేపీ శ్రేణులు తిరగబడితే మీరు తట్టుకోలేరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయ శాంతి మండిపడ్డారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజలు నీ కుటుంబం మీద పరువు నష్టం దావా వెయ్యాలని మండిపడ్డారు. ఒక్క మహిళా లిక్కర్ స్కాంలో ఉండటం ఎంటి? అని ప్రశ్నించారు. కవిత తెలంగాణ పరువు తీసిందని, ఆమె మా పార్టీ నేతలపైన పరువు నష్టం దావవేయడం ఏంటని? ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్‌ నీ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి వెలివేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి నీ అంత అవినీతి చేయలేదని మండిపడ్డారు. అవినీతిలో కూడా లిమిట్ దాటారని ఆరోపించారు. మిమ్మల్ని సరైన సమయంలో ఈడీ పిలుస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు బయటికీ వస్తాయని తీవ్రవ్యాఖ్యలు చేశారు. నీవూ ఎన్ని అడ్డంకులు సృష్టించిన మేము ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. మేము తిరగబడితే మీరు తట్టుకోలేరని హెచ్చరించారు. 5లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తిశారని విమర్శించారు. మహిళా లిక్కర్ స్కాం లో ఉందంటే పరువు ఉందా మీకు? అంటూ ప్రశ్నించారు.

BJP నేతలపై MLC కవిత పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. సిటీ సివిల్ కోర్టులో కవిత పిటిషన్ వేసారు. నేడు న్యాయస్థానం విచారణ చేయనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ, ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిర్సాలపై TRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జి ముందు ఇంజంక్షన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని పిటిషన్ లో కవిత పేర్కొన్నారు. ప్రజల్లో తనకున్న ప్రతిష్టను భంగం కలిగించేందుకు ఆక్రమ పద్ధతు లను ఎంచుకున్నారని కవిత తెలిపారు. ప్రతివాదులు తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ తో కోరారు. మిగిలిన 32 జిల్లా కోర్టుల్లోనూ ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయాలన్న విషయం విధితమే..
Lakshmi Parvathi: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. టీడీపీని స్వాధీనం చేసుకోవాలి

Exit mobile version