రావణ రాజ్యం పోవాలి.. రాముడి రాజ్యం రావాలి అంటూ పిలుపునిచ్చారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో రోడ్ షోలో పాల్గొన్న ఆమె.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ ప్రచారం కంటే.. ప్రజల బీజేపీ ప్రచారం ఎక్కువగా ఉందన్నారు.. ప్రజలు బీజేపీ పార్టీ ప్రచారాన్ని భుజాన వేసుకున్నారన్న రాములమ్మ.. ఈటల రాజేందర్ ఆరు సార్లు గెలిచాడంటే ప్రజల మద్దతు ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు..
సీఎం కేసీఆర్ చేస్తున్న తప్పులకు ఈ రోజు హుజురాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు విజయశాంతి.. తెలంగాణ ఉద్యమ కారులను అవహేళన చేశాడు, తడిగుడ్డతో గొంతుకోశాడు అని ఆరోపించిన ఆమె.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మోసం అక్కడి నుండే మొదలైందన్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన కరోన కాలంలో ఈటెల రాజేందర్ తన డ్యూటీ తను చేశాడని.. కానీ, కరోన కాలంలో ప్రాణ తీపితో బయటకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏడేళ్లు గా మంత్రి పదవిలో ఉన్న ఈటెలను ఏడూ నిమిషాల్లో తీసేశాడని మండిపడ్డారు.. తెలంగాణ ద్రోహులను దగ్గర పెట్టుకున్నావు, ఉద్యమ కారులను నడిరోడ్డు పై వదలేశావు కేసీఆర్ అంటూ ఫైర్ అయిన ఆమె.. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉద్యమకారులకు తోడుగా ఉండేది బీజేపీ పార్టీ.. నిన్ను గద్దె దింపే వరకు పోరాడుతుందన్నారు.. ఇక, దళితబంధు అనేది ఒక మాయ.. ప్రజలకు మేలు చేయడం కాదు, మోసం చేయడమే కేసీఆర్ పని అన్నారు విజయశాంతి.