Site icon NTV Telugu

Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్ సోదాలు.. నేడు వీసీ ని విచారించే చాన్స్

Telangana University

Telangana University

Telangana University: తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ, విజిలెన్స్ బృందాల దాడుల టెన్షన్ మొదలైంది. నిన్న 8 గంటల పాటు యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టిన అధికారుల బృందం కీలక దస్త్రాలు, హార్డ్ డిస్క్ ల స్వాధీనం చేసుకున్నారు. నేడు వీసీ ని విచారించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇవాళ కూడా ఏసీబీ, విజిలెన్స్ బృందం తనిఖీలు చేపట్టనున్నారు. యూనివర్సిటీ రెండేళ్ల బ్యాంక్ లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. యూనివర్సిటీలో రెండేళ్లలో చేసిన ఖర్చులు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలు, పదోన్నతులు, నిధుల దుర్వినియోగం విచారణ చేయాలని ఈసీ పిర్యాదు చేయడంతో ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఇంచార్జీ రిజిస్ట్రార్ కనకయ్యను విజిలెన్స్ అధికారులు విచారించారు. ఇవాల తనిఖీలపై ఉత్కంఠ నెలకొంది.

Read also: Saptapadhi: ఎడారిలో సప్తపది..

అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగంతో వివాదంగా మారిన తెలంగాణ యూనివర్సిటీ హైదరాబాద్ కు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో దాదాపు 15 మందికి పైగా విజిలెన్స్ అధికారులు మూడు వాహనాల్లో పరిపాలన భవనం వద్దకు వచ్చి పరిపాలన భవనంలోని వీసీ ఛాంబర్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, అకౌంట్ సెక్షన్, ఇంజినీరింగ్ విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. అంతకుముందు ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమైన కంప్యూటర్ సీపీయూ, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అకౌంట్ సెక్షన్ లో పెట్టి అందులోని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పాలక మండలి, ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జిల్లాకు చేరుకున్న విజిలెన్స్ అధికారుల బృందం మంగళవారం మధ్యాహ్నం పరిపాలనా భవనానికి చేరుకుంది. వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా అప్పటికే కారులో పరిపాలన భవనం నుంచి ముఖ్యమైన ఫైళ్లను తీసుకుని వెళ్లిపోయారు. అధికారుల బృందం తొలుత వీసీ ఛాంబర్‌కు వెళ్లి చూడగా వీసీ అక్కడ లేకపోవడంతో వీసీ పీఏ సవిత కూడా ఛాంబర్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. పరిపాలన భవనంలోని ఎస్‌బీఐ బ్యాంకు అధికారులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు యూనివర్సిటీకి సంబంధించిన అన్ని ఖాతాలకు సంబంధించిన లావాదేవీల వివరాలను సేకరించారు. అవన్నీ ప్రింటవుట్ ద్వారా బ్యాంకు నుంచి తీసుకున్నవే. అకౌంట్ సెక్షన్ లో ఐదు కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లను సీజ్ చేసి సీల్ చేశారు.
Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Exit mobile version