NTV Telugu Site icon

Venkatesh Netha: బీజేపీతో బీఆర్ఎస్ అంతర్గతం ఒప్పందం.. వెంకటేష్ నేత కీలక వ్యాఖ్యలు

Venkatesh Netha

Venkatesh Netha

Venkatesh Netha: బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒప్పందంలో ఉందని మాజీ బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బొర్లకుంట వెంకటేశ్‌ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ వన్ అధికారిగా 18 సంల సర్వీస్ ఉండగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. మొదట కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడానని అన్నారు. ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీగా టీఆర్ఎస్ నుంచి గెలిచానని తలిపారు. బీఆర్ఎస్ సిద్దాంతాలు, నియమ నిబంధనలు.. ఇటీవల జరగుతున్న అంశాల వల్ల బీఆర్ఎస్ రాజీనామా చేశానని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Harda Factory Blast : హరదా పేలుడులో పేరెంట్స్ ని కోల్పోయిన పిల్లల ఏంటని ప్రశ్నిస్తున్న స్థానికులు

ఐదేళ్ల పాటూ తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్ లో గళమెత్తి పోరాడానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒప్పందంలో ఉందని అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపిందన్నారు. 2018 లో రాజకీయ జన్మ నిచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాహుల్ యాత్ర నన్ను ప్రేరేపించిందన్నారు. రాహుల్ నాయకత్వంలో నా లక్ష్యాన్ని చేరుకుంటా అని తెలిపారు. కాంగ్రెస్ లో బేషరతుగా చేరానని అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ అపరిపక్వ ప్రకటనలు ఏ పార్టీకి సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ గెలిచే స్థానాల్లో బీజేపీ అంతర్గత మద్దతు బీజేపీ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతు ఇవ్వనుందని తెలిపారు. పార్టీ సిద్దాంతాలు నచ్చలేదని.. రాజీనామా లేఖలో కేసీఆర్ కు స్పష్టం చేశానని అన్నారు.

Read also: AP Budget 2024: ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. 2,86, 389 కోట్లు

ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సమక్షంలో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల కోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన నేత వెంకటేష్ మందు బాబుల రాజకీయాల్లోకి వచ్చారు. 2018లో కాంగ్రెస్ తరపున చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి 2019లో పెదపడల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల సందర్భంగా స్వదేశానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Vandebharat Sleeper Trains: తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు వచ్చేస్తున్నాయి..!!

Show comments