Site icon NTV Telugu

Venkaiah Naidu : యువత వీటిని తెలుసుకోవాలి… నేర్చుకోవాలి

హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మ‌హోత్స‌వాలు ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికి తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మనదేశంలో పూర్వ కాలం నుంచి సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయని, ఎంతో మంది పోరాడితే మనం స్వేచ్ఛగా ఉన్నామని, ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క వర్గం వల్లకాదు ఎందరో పోరాడితే మనకు స్వాతంత్రం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. భారతీయ సంస్కృతి హైందవ సంస్కృతి అని, ప్రపంచంలోని అన్ని సంస్కృతుల్లో భారతీయ సంస్కృతి గొప్పదన్నారు.

మన సంస్కృతిపై ఎన్ని దాడులు జరిగిన దాన్ని కోల్పోలేదు.. ఈ కార్యక్రమంతో అన్ని కళలను అందరికి పరిచయం చేస్తుండటం సంతోషం.. యువత వీటిని తెలుసుకోవాలి… నేర్చుకోవాలి.. మన కళలను మన ముందు తరాలకు అందించాలన్నారు. మాతృ భాషను కాపాడుకోవాలి.. ముందు మన భాష తరువాతే ఇతర భాష మాట్లాడాలి.. కొన్ని శక్తులు వీటిని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.. వాటిని మనం కాపాడుకోవాలి.. కులం మతం కాదు మనం అందరం భారతీయులం.. ప్రపంచ దేశాల పర్యటనకు వెళ్లేముందు మన దగ్గర ఉన్న కళా ఖండాలను చూడాలన్నారు.

Exit mobile version