NTV Telugu Site icon

క‌రోనా పంజా.. వేముల‌వాడ రాజ‌న్న ఆల‌యం మూత‌..!

Vemulawada

Vemulawada

క‌రోనా సెకండ్‌వేవ్ పంజా విసురుతోంది.. క‌రోనా మ‌హ‌మ్మారి తొలినాళ్ల‌లో అన్ని ఆల‌యాలు మూత‌ప‌డి.. క్ర‌మంగా ఆ త‌ర్వాత తెరుచుకున్నాయి.. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతితో అధికారులు అప్ర‌మ‌త్తం అవుతున్నారు.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో క‌రోనా కేసులు విజృంభిస్తుండ‌డంతో.. ఈ నెల 18వ తేదీ నుండి 22 వరకు రాజన్న ఆలయాన్ని మూసివేయాల‌ని నిర్ణ‌యించారు అధికారులు.. మొత్తంగా ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి అనుమతి రద్దు చేశారు దేవాదాయ శాఖ అధికారులు.. ఇక‌, ఈనెల 21న రాజన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణం నిర్వ‌హించ‌నున్నారు.. స్వామివారి నిత్య పూజలు, సీతారాముల కళ్యాణం అంతర్గతంగా నిర్వహించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.. అంటే.. ఈ కార్య‌క్ర‌మాల‌కు భ‌క్తుల‌ను ఎవ్వ‌రినీ అనుమ‌తించ‌బోర‌న్న‌మాట‌. కాగా, వేముల‌వాడ రాజ‌న్న ఆల‌యానికి నిత్యం వేలాది మంది భ‌క్తులు వ‌స్తుంటారు.. కోడులు ఇచ్చి మొక్కులు చెల్లించుకోవ‌డం తెలిసిందే.