ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అధ్యయనం చేయడం కోసం మహారాష్ర్ట ప్రభుత్వ ఇంజనీర్ల బృందం ఆదివారం చేరుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్ల దర్శించుకున్నారు. నాగపూర్ ఈఎన్ సి అనిల్ బహుదూరె ఆధ్వర్యంలో 15 ఇంజనీర్ల బృందం ప్రాజెక్టుల ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు వేములవాడలో మీడియా తో మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభ ప్రపంచానికి ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టును నిర్మించడం చాలా గొప్ప విషయమన్నారు. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా కాళేశ్వరం ప్రాజెక్టు ఉండటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా వారు పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేషనల్ మీడియాలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయని వారు తెలిపారు. .ఇంత గొప్పగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును అధ్యయనం చేయడం కోసం 15 మంది బృందంతో ఇక్కడికి వచ్చామని తమ రాష్ర్టంలోని ప్రాజెక్టుల నిర్మాణాలకు ఈ సందర్శన ఉపయోగడుతుందని ఆయన వెల్ల డించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నామన్నారు. సాగు, తాగునీటి రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇంజనీర్ల బృందం పని తీరు ఎంతో ఆదర్శవంతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి మహాత్తర ప్రాజెక్టుల వలన ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన వెల్లడించారు. భవిష్యత్‌లో నీటి సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని వారు పేర్కొన్నారు.